Pushpa: అల్లు అర్జున్ ని ప్రశంసలతో ముంచెత్తిన బాలీవుడ్ క్రేజీ హీరో.. బన్నీ కళ్ళల్లోని ఆ ఫైర్..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 09, 2022, 06:03 PM IST
Pushpa: అల్లు అర్జున్ ని ప్రశంసలతో ముంచెత్తిన బాలీవుడ్ క్రేజీ హీరో.. బన్నీ కళ్ళల్లోని ఆ ఫైర్..

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ చేసిన పాన్ ఇండియా ప్రయత్నం పుష్ప మంచి ఫలితాన్నే ఇచ్చింది. ముఖ్యంగా హిందీలో పుష్ప చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. అల్లు అర్జున్ నటన, స్మగ్లర్ గా మొరటు యాటిట్యూడ్, యాక్షన్ అంశాలు నార్త్ జనాలకు బాగా నచ్చేశాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ చేసిన పాన్ ఇండియా ప్రయత్నం పుష్ప మంచి ఫలితాన్నే ఇచ్చింది. ముఖ్యంగా హిందీలో పుష్ప చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. అల్లు అర్జున్ నటన, స్మగ్లర్ గా మొరటు యాటిట్యూడ్, యాక్షన్ అంశాలు నార్త్ జనాలకు బాగా నచ్చేశాయి. అయితే లోకల్ గా మాత్రం పుష్ప చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. కానీ సుక్కు, అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 పై ఆసక్తి పెంచడం లో సక్సెస్ అయ్యారు. 

ఇదిలా ఉండగా పుష్ప చిత్రంపై సెలెబ్రిటీల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాలీవుడ్ క్రేజీ నటుడు అర్జున్ కపూర్ పుష్ప చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. అల్లు అర్జున్ నటనని కొనియాడాడు. పుష్ప చిత్రం వీక్షించిన తర్వాత అర్జున్ కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 

పుష్ప సినిమా కాదు.. అదొక అద్భుతమైన అనుభూతి. యాటిట్యూడ్, ఇంటెన్సిటీ, కూల్ నెస్ కలగలిపిన చిత్రం ఇది. ఆర్య నుంచి అల్లు అర్జున్ సినిమాలన్నీ చూస్తున్నాను. ఒక అభిమానిగా ఆర్య నుంచి పుష్ప వరకు బన్నీ జర్నీ చూస్తుంటే అమేజింగ్ అనిపిస్తుంది. పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్. అల్లు అర్జున్ కళ్ళల్లోని ఆ ఫైర్ బిగ్ స్క్రీన్ ని తగలబెట్టే విధంగా ఉంది అంటూ అర్జున్ కపూర్ బన్నీని ప్రశంసలతో ముంచెత్తాడు. అర్జున్ కపూర్ మాటలకు అల్లు అర్జున్ కృతజ్ఞతలు చెబుతూ బదులిచ్చాడు. 

డిసెంబర్ 17న పుష్ప చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 8 నుంచి సౌత్ భాషల్లో ఈ చిత్రం అమెజాన్ లో స్ట్రీమింగ్ మొదలైంది. పుష్ప పాన్ ఇండియా ప్రాజెక్టు. పార్ట్ 2 కి కావలసిన ఆడియన్స్ రీచ్ పార్ట్ 1 తో సాధ్యం అయ్యిందనే చెప్పాలి. పార్ట్ 2 భారీ స్థాయిలో ఉండబోతోందని ఇప్పటికే చిత్ర యూనిట్ హింట్స్ ఇస్తున్నారు. 

బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. అజయ్ ఘోష్, అనసూయ, రావు రమేష్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. పార్ట్ 2 లో ఫహద్ ఫాజిల్ ప్రధాన విలన్ గా కనిపించబోతున్నాడు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Release ఆగిపోవడానికి అసలు కారణం ఇదే ? బాలయ్య నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు?
Dhurandhar Review: ధురంధర్ మూవీ ట్విట్టర్‌ రివ్యూ.. రణ్‌వీర్‌ సింగ్‌ సినిమాలో హైలైట్స్ ఇవే