మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన రామ్‌చరణ్‌.. ?

Published : Dec 26, 2022, 08:10 PM IST
మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన రామ్‌చరణ్‌.. ?

సారాంశం

ఇటీవల బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు రామ్‌చరణ్‌. ఇప్పుడు మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ఈ ప్రాజెక్ట్ హాట్‌ టాపిక్‌ అవుతుంది.

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ వరుసగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే శంకర్‌తో `ఆర్‌సీ15` సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో ఈ సినిమా రూపొందుతుంది. దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకాంత్‌, అంజలి కీలకపాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్రలో సీఎంగా, మరో పాత్రలో ఐఏఎస్‌ అధికారిగా కనిపిస్తున్నారని తెలుస్తుంది. 

దీంతోపాటు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. `ఆర్‌సీ16` పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. త్వరలోనే ఇది అధికారికంగా ప్రారంభించనున్నారు. దీంతోపాటు తాజాగా మరో సినిమాకి సైన్‌ చేశారట రామ్‌చరణ్‌. కన్నడ దర్శకుడితో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. 

కన్నడలో మఫ్టీ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాని రూపొందించిన నర్తన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారట. ఓ భారీ యాక్షన్‌ మూవీకి ప్లాన్‌ చేస్తున్నారట. యూవీ క్రియేషన్స్ సంస్థ దీన్ని నిర్మించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. స్క్రిప్ట్ ఫైనల్‌ అయ్యాక దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే గతంలోనే ఈ సినిమా చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అది ఓ కొలిక్కి వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే నర్తన్‌ గతంలో యష్‌ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఆ ప్రాజెక్ట్ వర్కౌట్‌ కాలేదని తెలుస్తుంది. అందుకే అదే కథని రామ్‌చరణ్‌కి చెప్పగా, ఆయన సుముఖంగా ఉన్నారని, ప్రస్తుతం డిస్కషన్‌ దశలో ఉందని త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్‌ రిజెక్ట్ చేసిన కథతో బుచ్చిబాబు సినిమా చేస్తున్నారు రామ్‌చరణ్‌. ఇప్పుడు యష్‌ రిజెక్ట్ చేసిన కథని చేయబోతున్నారనే వార్త టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ గా మారింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే
OTT : 2025లో అత్యధికంగా చూసిన 10 వెబ్ సిరీస్‌లు, IMDb ర్యాంకింగ్స్