‘దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది హత్యే’.. షాకింగ్ విషయాలను వెల్లడించిన డాక్టర్!

Published : Dec 26, 2022, 07:03 PM ISTUpdated : Dec 26, 2022, 07:04 PM IST
‘దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది హత్యే’.. షాకింగ్ విషయాలను వెల్లడించిన డాక్టర్!

సారాంశం

బాలీవుడ్ దివంగత స్టార్ హీరో సుశాంత్ సింగ్  రాజ్ పుత్ ది సూసైడ్ కాదని.. తనది హత్యేనని తాజాగా కూపర్ ఆస్ప్రతి డాక్టర్ కుమార్ షా వెల్లడించారు. ఈ సందర్భంగా సంచలన విషయాలను వెల్లడించారు.   

బాలీవుడ్ స్టార్ హీరో, దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushanth Singh Rajput) రెండేండ్ల కింద ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సుశాంత్ సింగ్ మరణం వెనక దాగి ఉన్నది ఎవరనేది స్పష్టం వెల్లడించలేకపోయారు అధికారులు. దీంతో సీబీఐ చేతికి కేసు వెళ్లింది. అప్పట్లో ఆయన సూసైడ్ అప్పట్లో బాలీవుడ్ లో  సంచలనం సృష్టించింది. ఇంకా  కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. తాజాగా సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదని, తనది హత్యేనని... SSR బాడీకి పోస్టుమార్టం చేసిన డాక్టర్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

రెండేళ్లైనా అసలు విచారణ పూర్తి కాకపోవడంతో తాజాగా ముంబైలోని కూపర్ ఆస్పత్రి ఎంప్లాయి డాక్టర్ రూప్ కుమార్ షా సంచలన విషయాలను బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. ‘సుశాంత్ సింగ్ మరణించడంతో.. పోస్టుమార్ట నిమిత్తం ఆయన బాడీని కూపర్ ఆస్పత్రికి పంపించారు. అదే సమయంలో మరో నాలుగు డెడ్ బాడీలు అందాయి. మొత్తం ఐదు బాడీలు రాగా.. అందులో ఒకటి వీఐపీది అని చెప్పారు. పోస్టుమార్టం చేసేందుకు వెళ్లినప్పుడే ఆయన్ని గుర్తుపట్టాం. తన శరీరంపై అనేక గుర్తులు కూడా ఉన్నాయి. మెడపై రెండు, మూడు గుర్తులున్నాయి. 

అయితే, పోస్టుమార్టం సమయంలో కేవలం ఫొటోలు మాత్రమే తీయాలని పైఅధికారులు కోరారు.  అందుకే అలా చేశాం. ఆ తర్వాత సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు.. హత్యేనని కూడా ఆఫీసర్లకు చెప్పాం. కానీ వారు నిబంధనలకు ప్రకారం పనిచేయాలని చెప్పారు. వెంటనే మా సీనియర్స్ కూ చెప్పిన ఫలితం లేకుండా పోయింది. అంతేకాకుండా.. త్వరగా ఫొటోస్ తీసి బాడీని తమకు అప్పగించాలని పోలీసులు చెప్పడంతో.. రాత్రిపూటనే పోస్టుమార్టం చేశాం.’ అంటూ డాక్టర్ చెప్పిన సంచలన విషయాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. 

స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే సుశాంత్ సింగ్ ఫ్యాన్ కు ఉరేసుకోవడం ఇండస్ట్రీని ఉల్కిక్కి పడేలా చేసింది. 2020 జూన్ 14న తన గదిలోనే ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోవడం సంచలనంగా మారింది.  అతని మరణాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి బదిలీ చేయడానికి ముందు ముంబై పోలీసులు దర్యాప్తు చేశారు. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్, నటి రియా చక్రవర్తిని కూడా అరెస్టు చేసి విచారించిన విషయం తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?