
యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపుదిద్దుకోనున్న క్రేజీ ప్రాజెక్ట్ నుంచి నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) స్పెషల్ పోస్టర్ విడుదలైంది. ఈరోజు ఆయన పుట్టిన రోజు కావడంతో మేకర్స్ ప్రత్యేక పోస్టర్ తో విషెస్ తెలిపారు. చివరిగా ‘జాతిరత్నాలు’ చిత్రంతో అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఇరగదీసిన నవీన్ పొలిశెట్టి నెక్ట్స్ ప్రాజెక్ట్ లోనూ ఆడియెన్స్ ను మరింతగా నవ్వించే పాత్రలోనే నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ లో అనుష్క శెట్టి 48 (Anushka Shetty 48) వ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. చిత్రానికి మహేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే అనుష్కశెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మూవీలో అనుష్క చెఫ్ గా కనిపించబోతోంది. ఇక నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా అలరించబోతున్నారు. ‘సిద్ధు పొలిశెట్టి’ అనే పాత్రలో నటిస్తున్నారు. పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. స్టైలిష్ సూట్ లో నవీన్ పొలిశెట్టి అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంతోనూ ఏ స్థాయిలో అలరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక నవీన్ పొలిశెట్టి పుట్టినరోజు కావడంతో అనుష్క శెట్టి స్పెషల్ విషెస్ తెలిపింది. ఈ ఏడాదంతా సుఖఃసంతోషాలతో పాటు విజయాలను అందుకోవాలని ఆకాంక్షించింది.
ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అనుష్క శెట్టి కూడా ఈ మధ్యనే షూటింగ్ లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు నవీన్ పొలిశెట్టి సైతం అటు తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ను కొనసాగిస్తూనే ఈ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇక ఆ మధ్యలోనే నెక్ట్స్ మూవీ ‘అనగనగా ఓ రాజు’ నుంచి టైటిల్ టీజర్ వచ్చిన విషయం తెలిసిందే. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సందడి చేయబోతున్నారు.