Ram Charan: `RC16` బిగ్గెస్ట్ అప్‌డేట్‌.. పాన్‌ ఇండియాని మించి..

Published : Dec 14, 2021, 09:35 PM ISTUpdated : Dec 14, 2021, 09:39 PM IST
Ram Charan: `RC16` బిగ్గెస్ట్ అప్‌డేట్‌.. పాన్‌ ఇండియాని మించి..

సారాంశం

రామ్‌చరణ్‌ నెక్ట్స్ `జెర్సీ` ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `ఆర్‌సీ16` పేరుతో ఈ సినిమా రాబోతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఈ క్రేజీ అప్‌డేట్‌నిచ్చారు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. 

రామ్‌చరణ్‌ (Ram Charan)ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు. `ఆర్‌ఆర్‌ఆర్`(RRR Movie) సినిమా చేయడంతోనే ఆయన పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు. ఈ సినిమా జనవరి 7న విడుదల కాబోతుంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ మరో హీరోగా నటిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈసినిమా కోసం యావత్‌ ఇండియన్‌ ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రామ్‌చరణ్‌ మరో సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన ఇండియన్‌ బిగ్గెస్ట్ డైరెక్టర్‌ శంకర్‌తో ఓ పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నారు. దిల్‌రాజ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. 

శంకర్‌, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా `ఆర్‌సీ15`(#RC15) ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. అంజలి, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే నెక్ట్స్ `జెర్సీ` ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి(Gowtam Tinnanuri) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `ఆర్‌సీ16`(#RC16) పేరుతో ఈ సినిమా రాబోతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఈ క్రేజీ అప్‌డేట్‌నిచ్చారు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. ఈ సినిమా ఎలా ఉండబోతుందో రివీల్‌ చేశారు. Ram Charan-గౌతమ్‌ కాంబినేషన్‌లో సినిమాఎలా ఉండబోతుందో అని అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న నేపథ్యంలో దర్శకుడు గౌతమ్‌ ఓపెన్‌ అయ్యారు. 

హిందీ మీడియాతో మాట్లాడుతూ ఆయన చరణ్‌ సినిమా తన నెక్ట్స్ చిత్రంగా ఉండబోతుందని చెప్పారు. ఇందులో చిరంజీవి నటించడం లేదని చెప్పారు.కేవలం చరణ్‌ మాత్రమే ఉంటారని చెప్పారు. ఇది పాన్‌ ఇండియా లెవల్‌లో ఉంటుందట. ఇంకా చెబుతూ, పాన్‌ ఇండియాని మించి ఉండబోతుందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్టు చెప్పకనే చెప్పారు. అంతేకాదు ఇది పూర్తి యాక్షన్‌ఫిల్మ్ అని చెప్పారు. మరోవైపు బాలీవుడ్‌లో షారూఖ్‌ ఖాన్‌ని కూడా కలిసేందుకు రెడీగా ఉన్నారట. షారూఖ్‌ `జెర్సీ`ని ప్రశంసించిన నేపథ్యంలో గౌతమ్‌ బాద్‌షాని కలవబోతున్నారట. 

ఇక తెలుగులో నాని హీరోగా రూపొందిన `జెర్సీ`ని హిందీలో షాహిద్‌ కపూర్‌తో రూపొందిస్తున్నారు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. ఇది విడుదలకు సిద్ధమవుతుంది. తెలుగులో నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. 

also read: RRR:ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మధ్య సంతకాలతో ఎగ్రిమెంట్స్

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే
Suman Shetty Remuneration: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీని మించి పారితోషికం.. సుమన్‌ శెట్టికి దక్కింది ఎంతంటే?