Shyam Singh Roy trailer: దేవుడినైనా ఎదురించమంటోన్న నాని.. ట్రైలర్‌ మైండ్‌ బ్లోయింగ్‌

Published : Dec 14, 2021, 08:14 PM ISTUpdated : Dec 14, 2021, 08:33 PM IST
Shyam Singh Roy trailer: దేవుడినైనా ఎదురించమంటోన్న నాని.. ట్రైలర్‌ మైండ్‌ బ్లోయింగ్‌

సారాంశం

`శ్యామ్‌ సింగరాయ్‌` చిత్ర ట్రైలర్‌ని తాజాగా మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ట్రైలర్‌ మైండ్ బ్లోయింగ్‌గా ఉందని చెప్పొచ్చు.

నేచురల్ స్టార్‌ నాని(Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ `శ్యామ్‌సింగరాయ్‌`(Shyam Singh Roy). 1970నాటి కథతో దర్శకుడు రాహుల్‌ సాంక్రిత్యాన్‌ రూపొందిస్తున్న పీరియాడికల్‌ లవ్‌ స్టోరీ చిత్రమిది. కృతి శెట్టి(Krithi Shetty), సాయిపల్లవి(Sai Pallavi) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ని ఆవిష్కరించారు. నాని ఇందులో రెండు పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. వాసు అనే ఫిల్మ్ మేకర్‌గా, శ్యామ్‌సింగరాయ్‌ అనే జర్నలిస్ట్ కమ్‌ రైటర్‌గా కనిపించబోతున్నట్టు ట్రైలర్ నిచూస్తుంటే అర్థమవుతుంది. 

తాజాగా విడుదలైన ట్రైలర్ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంది. సాఫ్ట్ వేర్‌ జాబ్‌ చేసే వాసు(నాని).. సినిమాలపై ఇష్టంతో.. దర్శకుడిగా రాణించాలని తపిస్తుంటారు. చిన్న బడ్జెట్‌ చిత్రాలను రూపొందిస్తున్నారు. కృతి శెట్టి తన హీరోయిన్‌. సినిమా తీసే క్రమంలో కృతి ప్రేమలో పడతారు. ఘాటు ప్రేమలో మునిగితేలుతుంటారు. అనుకోని ఓ ఇన్సిడెంట్‌ కారణంగా జైల్‌కి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు శ్యామ్‌సింగరాయ్‌ పాత్ర తెరపైకి వస్తుంది. దేవదాసిగా ఉన్న సాయిపల్లవి ప్రేమలో పడతాడు శ్యామ్‌ సింగరాయ్‌. ఆమెని ఆ వృతి నుంచి బయటకు తెప్పించే ప్రయత్నం చేస్తాడు. అందుకోసం దేవుడినైనా ఎదురించమని చెబుతాడు. మరి శ్యామ్‌సింగరాయ్‌కి, వాసుకి సంబంధం ఏంటి? అనేది `శ్యామ్‌సింగరాయ్‌` సినిమా కథ అని ఈ ట్రైలర్‌ స్పష్టం చేస్తుంది. 

కథ క్లారిటీగా చెప్పేశాడు దర్శకుడు. కానీ ట్రైలర్‌ మాత్రం గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంది. రెండు భిన్నమైన పాత్రల్లో నాని అద్భుతంగా నటించారు. తనదైన యాక్టింగ్‌తో మెస్మరైజ్‌ చేశారని చెప్పొచ్చు. మరోవైపు కృతి శెట్టి బోల్డ్ రోల్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. `టాక్సీవాలా`తో నిరూపించుకున్న దర్శకుడు రాహుల్‌ సాంక్రిత్యాన్‌ ఈ చిత్రాన్నిరూపొందించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వరంగల్‌లోని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్‌ గ్రౌండ్‌లో `రాయల్‌ ఈవెంట్‌` పేరుతో నిర్వహిస్తున్నారు. ఈ నెల 24న క్రిస్మస్‌ కానుకగా సినిమా విడుదల కాబోతుంది.

also read: Pushpa: బన్నీ పాన్‌ ఇండియా ఆశలపై నీళ్లు ‌.. బిగ్‌ మార్కెట్‌ని లైట్‌ తీసుకున్న `పుష్ప` నిర్మాతలు?

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే
Suman Shetty Remuneration: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీని మించి పారితోషికం.. సుమన్‌ శెట్టికి దక్కింది ఎంతంటే?