రాంచరణ్ కి అమిత్ షా ఫోన్.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోమ్ మంత్రి

Published : Mar 27, 2023, 04:17 PM IST
రాంచరణ్ కి అమిత్ షా ఫోన్.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోమ్ మంత్రి

సారాంశం

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నేడు తన 38వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు రాంచరణ్ కి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. 

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నేడు తన 38వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు రాంచరణ్ కి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మెగా ఫ్యాన్స్ అయితే కొన్ని రోజుల నుంచే హంగామా మొదలు పెట్టారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ గ్లోబల్ స్టార్ గా మారడంతో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ పుట్టినరోజు చరణ్ కి ఎంతో మెమొరబుల్ గా మారుతోంది. 

అప్పటికే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నుంచి చరణ్ బర్త్ డే కానుకగా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి గేమ్ ఛేంజెర్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ లో చరణ్ సూపర్ స్టైలిష్ గా అదిరిపోయే మేకోవర్ లో కనిపిస్తున్నాడు. 

ఇక చరణ్ బర్త్ డేని మరింత మెమొరబుల్ గా మార్చుతూ ఏకంగా కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. అమిత్ షా ఫోన్ లో చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అమిత్ షా అంతటి వ్యక్తి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడంతో చరణ్ ఎంతో సంతోషించాడు. తిరిగి అమిత్ షాకి కృతజ్ఞతలు తెలిపారు. 

ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ గెలిచిన తర్వాత రాంచరణ్ అమిత్ షాని కలసిన సంగతి తెలిసిందే. చిరు, చరణ్ ఇద్దరూ అమిత్ షాని మీట్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ సాధించినందుకు అమిత్ షా అభినందించారు. 

మహేష్ బాబు, ఎన్టీఆర్, సమంత, పవన్ లాంటి స్టార్స్ రాంచరణ్ కి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar OTT విడుదల తేదీ ఖరారు.. బాహుబలి రేంజ్ సినిమా ఎక్కడ చూడాలో తెలుసా ?
O Romeo Trailer: ప్రభాస్ హీరోయిన్ నెక్స్ట్ మూవీ ఇదే, ట్రైలర్ అదిరిందిగా