Game Changer First Look : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ లుక్.. స్టైలిష్ గా గ్లోబల్ స్టార్.. ఫ్యాన్స్ ఫిదా

Published : Mar 27, 2023, 03:49 PM IST
Game Changer First Look : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ లుక్.. స్టైలిష్ గా గ్లోబల్ స్టార్.. ఫ్యాన్స్ ఫిదా

సారాంశం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ సర్ ప్రైజ్ లు అందుతూనే ఉన్నాయి. ఇప్పటికే టైటిల్ ను రివీల్ చేయగా.. తాజాగా రామ్ చరణ్ ఫస్టు లుక్ పోస్టర్ ను వదిలారు.  

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  - క్రియేటివ్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం Game Changer.  స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఎంతో కాలంగా ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈరోజు చరణ్ 38వ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ వరుస అప్డేట్స్ అందిస్తూ ఫుల్ ఖుషీ చేస్తున్నారు. ఇప్పటికే టైటిల్ మరియు లోగోను విడుదల చేసి ఆసక్తి పెంచారు. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సైతం విడుదల చేశారు. 

‘గేమ్ ఛేంజర్’ నుంచి తాజాగా విడుదలైన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. హాలీవుడ్ తరహాలో ఇచ్చిన రామ్ చరణ్ స్టిల్ ఆకట్టుకుంటోంది. డెనీమ్ జాకెట్, జీన్స్, సన్ గ్లాసెస్ ధరించి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. చెర్రీ హెయిర్ స్టైల్ నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. కొద్ది గడ్డంతోనూ మాస్ ట్రీట్ ను అందించారు. బైక్ పై కూర్చొని చెర్రీ ఇచ్చిన పోజుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఏదో ఛేజింగ్ సంబంధించిన సీన్ లో చెర్రీ ఇలా దర్శనమివ్వబోతున్నట్టు తెలుస్తోంది. 

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఉదయమే టైటిల్ మరియు లోగోకు సంబంధించిన యానిమేషన్ వీడియోను రిలీజ్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మొత్తానికి గతంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే చెర్రీ పుట్టిన రోజు టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని.. విడుదల చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

అయితే ఇప్పటికే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలుస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 28, ప్రభాస్ Project K చిత్రాలు 2014 సంక్రాంతి పోటీకి సిద్ధమయ్యాయి. ‘గేమ్ ఛేంజర్’ కూడా సంక్రాంతికే రాబోతుందని ప్రచారం జరుగుతోంది. దీనిపైనా మేకర్స్ క్లారిటీ ఇస్తే ఉత్కంఠకు తెర పడే అవకాశం ఉంది. 

పొలిటికల్ డ్రామాలో చరణ్ డ్యూయేల్ యాక్టింగ్ తో ఆకట్టుకోబోతున్నారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani)  చెర్రీ సరసన ఆడిపాడుతోంది. అంజలి, ఎస్జే సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, నాజర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా