
స్టార్ వైఫ్ అల్లు స్నేహారెడ్డి ఫిట్నెస్ విషయంలో చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె పర్ఫెక్ట్ స్లిమ్ బాడీ మైంటైన్ చేస్తున్నారు. సాధారణంగా పెళ్ళై పిల్లలు పుట్టాక శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మహిళలు సులభంగా బరువు పెరిగే సూచనలుంటాయి. టీనేజ్ గ్లామర్ మైంటైన్ చేయాలంటే క్రమశిక్షణతో కూడిన జీవన విధానం చాలా అవసరం. టాలీవుడ్ స్టార్స్ మహేష్, అల్లు అర్జున్ భార్యలు నమ్రత, స్నేహారెడ్డి ఫిట్నెస్ ఫ్రీక్స్ గా ఉన్నారు. నమ్రత వయసు 51 ఏళ్ళు కాగా ఆమె స్టిల్ సో యంగ్ గా కనిపిస్తున్నారు.
ఈ విషయంలో అల్లు స్నేహారెడ్డిని కూడా మెచ్చుకోవాల్సిందే. ఒక ప్రక్క భార్యగా తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తూనే చక్కని శరీరాకృతి కొనసాగిస్తున్నారు. దానికి కారణం... అందం ఆరోగ్యం మీద ఆమెకు ఉన్న శ్రద్ధ. కాగా 2023కి స్నేహారెడ్డి తన ఫిట్నెస్ గోల్స్ మార్చేస్తున్నారు. ఇకపై తన లక్ష్యాలు ఇవి అంటూ ఆమె వీడియో విడుదల చేశారు. బరువు తగ్గడం కాదు శక్తివంతం కావాలనుకుంటున్నారట. భౌతిక ఆరోగ్యానికి బదులు ఆధ్యాత్మిక ఆరోగ్యం పొందాలనుకుంటున్నారట.
తక్కువ తినడం కాదు సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యమని గ్రహించారట. ఒకేసారి కఠిన కసరత్తులు చేయకుండా క్రమం తప్పకుండా చేయాలనుకుంటున్నారట. సన్నబడటం కాకుండా ధృడంగా తయారు కావాలనుకుంటున్నారట. ఈ విషయాలు తెలియజేస్తూ స్నేహారెడ్డి తన వర్క్ అవుట్ వీడియో విడుదల చేశారు. అది వైరల్ అవుతుంది.
కాగా 2011 మార్చ్ 6న స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ప్రేమను గెలిపించుకున్నారు ఈ జంట. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా స్నేహారెడ్డితో అల్లు అర్జున్ కి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. హైదరాబాద్ లో కొన్ని విద్యాసంస్థలకు అధిపతి అయిన శేఖర్ రెడ్డి కూతురే స్నేహారెడ్డి. అల్లు అర్జున్ తో వివాహానికి శేఖర్ రెడ్డి ఒప్పుకోలేదట. స్వయంగా అల్లు అరవింద్ వెళ్లి అడిగినా నో.. అన్నారు.
అయితే స్నేహారెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారట. అల్లు అర్జున్ ని తప్పా ఎవరినీ వివాహం చేసుకోనని తెగేసి చెప్పారట. దీంతో చేసేది లేక బన్నీని అల్లుడిగా శేఖర్ రెడ్డి ఒప్పుకున్నారట. టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్, స్నేహారెడ్డి లకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి పేరు అయాన్, అమ్మాయి అర్హ. ఖాళీ సమయంలో పిల్లలతో హాయిగా ఆడుకోవడం బన్నీకి ఇష్టమైన వ్యాపకం. అల్లు అర్హ శాకుంతలం చిత్రంతో నటిగా పరిచయమవుతున్నారు. శాకుంతలం ఏప్రిల్ 14న విడుదల అవుతుంది.