షాకింగ్ ఫ్యాక్ట్: “ఇంద్ర” లో ఈ ఎపిసోడ్ మొత్తం డైరెక్ట్ చేసింది చిరంజీవే

By Surya Prakash  |  First Published Aug 23, 2024, 1:55 PM IST

 268 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న తొలి తెలుగు సినిమాగా రికార్డ్ లు క్రియేట్ చేసింది. 



మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) న‌టించిన ఆల్ టైం బ్లాక్ బ‌స్ట‌ర్ ఇంద్ర (Indra).ఈ  సినిమాను  మెగాస్టార్ బ‌ర్త్ డే కానుక‌గా గురువారం (ఆగస్ట్ 22న) ఇంద్ర రీ రిలీజ్ చేసారు.  చిరంజీవి కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల‌లో ఇంద్ర ఒక‌టి కావటంతో అభిమానులు ఓ రేంజిలో ఈ సినిమా థియేటర్స్ దగ్గర హంగామా చేసారు. రీరిలీజ్ ని కూడా డైరక్ట్ రిలీజ్ లా సెలబ్రేట్ చేసుకన్నారు. ఈ  నేపధ్యంలో సినిమాకు సంభందించిన చాలా ఇంట్రస్టింగ్ విషయాలు బయిటకు వస్తున్నాయి.

అందులో ఒకటి  ఈ సినిమాలో ఒక ఎపిసోడ్ మొత్తాన్ని చిరంజీవే అప్పట్లో డైరెక్ట్ చేశారనే విషయం. ఈ సినిమాకి బి గోపాల్ డైరక్టర్ అయినా, అన్ని సీన్స్ తను తియ్యలేదట.   ఇంద్ర సినిమాలో మోస్ట్ పవర్ఫుల్ ఎపిసోడ్స్ లో ఒకటైన  ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తాన్ని చిరంజీవే తెరకెక్కించారు. అదెలా జరిగిందంటే...

Latest Videos

ఇంద్ర షూటింగ్ సమయంలోనే  బి గోపాల్ ప్రభాస్ అడవి రాముడు షూటింగ్ కూడా చేయాల్సి ఉంది.  దాంతో డేట్స్ క్లాష్ అయ్యేలా ఉంది. ఈ క్రమంలో బి.గోపాల్ టెన్షన్ పడుతూంటే చిరంజీవి ధైర్యం చెప్పి... ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తాన్ని చిరు నటిస్తూనే దర్శకత్వం వహించారట. ఇది మాత్రం చాలా మందికి తెలియదు.  

అలాగే ఈ సినిమాలో మరి కొన్ని విశేషాలుకి వస్తే... సినిమా క్లైమాక్స్ లో విలన్ ముఖేష్ రుషిని చావ చితక్కొట్టేసాడు చిరంజీవి.  జనం లేచి సినిమా అయ్యిపోయిందని బయిటకు వెళ్లే ఆ మూమెంట్ లో .. అప్పుడు చాంతాండంత డైలాగులు చెప్తే వింటాడా...అసలు ఆసక్తి ఉంటుందా అని  చిరంజీవి డౌట్ వచ్చిందిట. అదే అడుగుతూ... విలన్ ని నేను కొట్టేసిన తర్వాత ఇంకా డైలాగులు చెప్తూ కూర్చుంటే బాగుంటుందా అన్నారు తన చేతిలో ఉన్న మూడు పేజీల డైలాగ్ షీట్స్ చూస్తూ....

ఆ సినిమాకు డైరక్టర్ బి.గోపాల్ కానీ ...చిత్రం ఏమిటంటే ఆ  క్లైమాక్స్‌  ఫైట్స్‌ సీన్స్‌కు పరుచూరి గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు.  విలన్‌ ముఖేష్‌ రుషిని కొట్టిన తర్వాత చిరంజీవి మూడు పేజీల డైలాగ్‌లు చెప్పాల్సి ఉంది. తాము కష్టపడి, ఇష్టపడి రాసిన డైలాగ్స్. అయితే విలన్‌ను కొట్టేసిన తర్వాత డైలాగ్స్‌ చెబితే బాగుండదని చిరు చెప్పారు. తమకు నిజమే అనిపించింది. స్క్రిప్టు రాసేటప్పుడు ఉన్న ఎమోషన్ వేరు. ఇక్కడ ప్రాక్టికల్ గా తెరకెక్కేటప్పుడు ఉండే ప్రాక్టికాలిటి వేరు. మూడు పేజీలు డైలాగులు చెప్తే జనం వినటానికి ఉండరు. దాన్ని కుదించి ఒక్క ముక్కలో చెప్పాలి. అలా ఆలోచిస్తూ వెంటనే పెన్ను  పేపరు తీసుకుని ప్రక్కకు వెళ్లి కొద్ది నిముషాల్లోనే అద్బుతమైన డైలాగు రాసుకొచ్చి చిరంజీవి చేతిలో పెట్టారు గోపాల్ కృష్ట.  ఆ డైలాగే.. ‘నరుక్కుంటూ వెళ్తే, అడవి అన్నది మిగలదు. చంపుకొంటూ వెళ్తే మనిషి అన్నవాడు మిగలడు’  
 

సినిమా సారాంశం మొత్తం ఆ ఒక్క డైలాగుతో వచ్చేసింది. ఆ డైలాగుతో సినిమాకు ముగింపు వచ్చేసింది. చిరంజీవికి ఆ సందేహం రాకపోయినా, వచ్చినా మొహమాట పడినా క్లైమాక్స్ వేరే విధంగా ఉండేది.  

అలాగే ఈ సినిమాలో మరో చోట...చిరంజీవికు ఓ సందేహం వచ్చింది. తన మేనల్లుడు కోసం చిరంజీవి భాషా టైప్ లో దెబ్బలు తింటూంటారు. అయితే తను మెగాస్టార్..తన అభిమానులు ఏక్సెప్ట్ చేస్తారా అనే సందేహం ....మరో ప్రక్క నటుడుగా అలా చేయాల్సిందే అనే ఆలోచన... దాంతో పరుచూరి బ్రదర్శ్ ని పిలిచి...‘మేనల్లుడి కోసం నేను దెబ్బలు తింటున్నాను సరే. అభిమానులు ఆ సీన్‌ను ఒప్పుకొంటారా’ అని సందేహం వెళ్లబుచ్చారు.  అప్పుడు పరుచూరి బ్రదర్స్‌ను ఆ సమస్యకు  పరిష్కారం....ఓ డైలాగు రాసి చెప్పారు. అదే...

 "షావుకత్​ అలీఖాన్​.. తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టీ తల వంచుకొని వెళ్తున్నాను. లేకపోతే ఇక్కడనుంచి తలలు తీసుకెళ్లేవాడిని."

ఈ ఒక్క డైలాగుతో మొత్తం సీన్ జస్టిఫై అయ్యిపోయింది. అలాగే సినిమాలో ఎన్నో పవర్ ఫుల్ డైలాగులు ..  . "రానానుకున్నారా రాలేననుకున్నారా.. కాశికి పోయాడు.. కాషాయ మనిషైపోయాడు అనుకుంటున్నారా, వారణాసిలో బతుకుతున్నాడు తన వరసులు మార్చి ఉంటాడు అనుకుంటున్నారా.. అదే రక్తం అదే పౌరుషం." ,"వీరశంకర్​రెడ్డి.. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా"ఇలాంటి ఎన్నో డైలాగులు చిరంజీవి నోటి వెంట వస్తూనే థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. 
 

click me!