2022 దసరాకు యానిమల్ దిగుతుందంటున్న సందీప్ రెడ్డి వంగా!

Published : Mar 01, 2021, 01:35 PM IST
2022 దసరాకు యానిమల్ దిగుతుందంటున్న సందీప్ రెడ్డి వంగా!

సారాంశం

కబీర్ సింగ్ విడుదలైన ఏడాదిన్నర తరువాత 2021 జనవరిలో సందీప్ రెడ్డి తన నూతన చిత్రం ప్రకటించారు. బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ తో ఆయన యానిమల్ మూవీ చేస్తున్నట్లు జనవరి 1న అధికారిక ప్రకటన చేశారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో పరిణితీ చోప్రా హీరోయిన్ గా చేస్తున్నారు. 

ఒక్క సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేర్చింది. విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ ని చేసిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని సందీప్ రెడ్డి తెరకెక్కించిన విషయం తెలిసిందే. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో సందీప్ రెడ్డి తెరకెక్కించారు. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. దీనితో సందీప్ రెడ్డి ఫేమ్ బాలీవుడ్ లో కూడా పెరిగిపోయింది. 

కబీర్ సింగ్ విడుదలైన ఏడాదిన్నర తరువాత 2021 జనవరిలో సందీప్ రెడ్డి తన నూతన చిత్రం ప్రకటించారు. బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ తో ఆయన యానిమల్ మూవీ చేస్తున్నట్లు జనవరి 1న అధికారిక ప్రకటన చేశారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో పరిణితీ చోప్రా హీరోయిన్ గా చేస్తున్నారు. 

ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ మొదలు కావడం జరిగింది. కాగా నేడు యానిమల్ మూవీ విడుదల తేదీని దర్శకుడు సందీప్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 2022 దసరా కానుకగా డెవిల్ విడుదల కానున్నట్లు ఆయన తెలియజేశారు. దీనితో యానిమల్ విడుదలకు ఏడాదిన్నర సమయం ఉండనుంది. టి సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా యానిమల్ తెరకెక్కిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌