నా మొదటి ప్రేమకి బర్త్ డే విషెస్‌..తల్లికి రామ్‌చరణ్‌ ఎమోషనల్‌ పోస్ట్

Published : Feb 19, 2021, 04:50 PM ISTUpdated : Feb 19, 2021, 04:51 PM IST
నా మొదటి ప్రేమకి బర్త్ డే విషెస్‌..తల్లికి రామ్‌చరణ్‌ ఎమోషనల్‌ పోస్ట్

సారాంశం

మెగాస్టార్‌ చిరంజీవి సతీమణి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తల్లి సురేఖ పుట్టిన రోజు గురువారం జరిగింది. ఇంట్లో సింపుల్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అయితే ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ పంచుకున్న ఫోటో, ఆయన చెప్పిన ఎమోషనల్‌ విషెస్‌ హైలైట్‌గా మారాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

మెగాస్టార్‌ చిరంజీవి సతీమణి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తల్లి సురేఖ పుట్టిన రోజు గురువారం జరిగింది. ఇంట్లో సింపుల్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అయితే ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ పంచుకున్న ఫోటో, ఆయన చెప్పిన ఎమోషనల్‌ విషెస్‌ హైలైట్‌గా మారాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తల్లి సురేఖకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు రామ్‌చరణ్‌. నీ అమితమైన ప్రేమకు కృతజ్ఞతలు. అమ్మ నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు` అని ట్వీట్‌ చేశారు. మరోవైపు `నా మొదటి ప్రేమకి బర్త్ డే విషెస్‌. లవ్‌ యూ అమ్మ` అని పేర్కొన్నాడు చరణ్‌. ఈ సందర్భంగా అమ్మతో కలిసి దిగిన ఫోటోని పంచుకున్నాడు. 

ప్రస్తుతం ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మెగా ఫ్యామిలీ అంతా సురేఖకి బర్త్ డే విషెస్‌ చెబుతున్నారు. ఖుషీ అవుతున్నారు. రానా వంటి పలువురు సెలబ్రిటీలు కూడా సురేఖకి బర్త్ డే విషెస్‌ తెలియజేశారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ `ఆచార్య`లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. అక్టోబర్‌ 13న సినిమా విడుదల కానుంది. దీంతోపాటు శంకర్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?