హీరో యష్ అభిమాని ఆత్మహత్య... సూసైడ్ నోట్ లో యష్ కి విన్నపం!

Published : Feb 19, 2021, 03:16 PM IST
హీరో యష్ అభిమాని ఆత్మహత్య... సూసైడ్ నోట్ లో యష్ కి విన్నపం!

సారాంశం

 25ఏళ్ల యువకుడు మరణం కుటుంబంతో పాటు యష్ ని విషాదంలో నింపివేసింది. తాను జీవితంకి విఫలం చెందానని, కుటుంబ సభ్యుల ప్రేమను పొందలేక పోయానని ఆవేదనతో రామకృష్ణ అనే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రామకృష్ణ సూసైడ్ నోట్ లో తాను హీరో యష్ కి వీరాభిమానిని అని పేర్కొన్నాడు.

హీరో యష్ ఫ్యాన్ ఆత్మహత్య కర్ణాకటకలో కలకలం రేపింది. 25ఏళ్ల యువకుడు మరణం కుటుంబంతో పాటు యష్ ని విషాదంలో నింపివేసింది. తాను జీవితంకి విఫలం చెందానని, కుటుంబ సభ్యుల ప్రేమను పొందలేక పోయానని ఆవేదనతో రామకృష్ణ అనే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కర్ణాటకలోని మాండ్యం జిల్లాలోని కోడిదొడ్డి అనే విలేజ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. రామకృష్ణ సూసైడ్ నోట్ లో తాను హీరో యష్ కి వీరాభిమానిని అని పేర్కొన్నాడు.

 
అలాగే మాజీ సీఎం కాంగ్రెస్ నేత సిద్దా రామయ్యకు కూడా తాను అభిమానిని అతడు వెల్లడించాడు. యష్ మరియు సిద్దారామయ్య తన అంత్యక్రియలకు హాజరుకావాలని లేఖలో రామకృష్ణ పేర్కొన్నాడు. అభిమాని కోరిక మేరకు సిద్దా రామయ్య, రామకృష్ణ అంత్యక్రియలలో పాల్గొన్నాడు. రామకృష్ణ కుటుంబానికి ఆయన సంతాపం ప్రకటించడంతో పాటు ధైర్యం చెప్పారు. 


సంఘటన గురించి తెలుసుకున్న హీరో యష్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అభిమాని మృతిపై సోషల్ మీడియా వేదికగా యష్ స్పందించారు. హీరోలు తమ అభిమానుల నుండి ప్రేమ, ఆప్యాయత, విజిల్స్, చప్పట్లు వంటివి ఆశిస్తాం. అంతే కానీ ఇలాంటి బలవన్మరణాలు బాధ పెడతాయని ఆయన ట్విట్టర్ లో ఓ సందేశం పోస్ట్ చేశారు. యష్ అభిమాని మరణం కర్నాటకతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

PREV
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?