
మెగా ఫ్యామిలీకి వారసురాలు వచ్చి అప్పుడే ఆరు నెలలు అయిపోయింది. రామ్ చరణ్- ఉపాసన దంపతులకు పాప పుట్టిన సంగతి తెలిసిందే. పాపకు క్లిన్ కారా అని నామకరణం కూడా చేశారు. లలితసహస్త్ర నామాల్లోని బీజాక్షరాన్ని తన మనవరాలికి పేరుగా పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఇక క్లిన్ కారా పుట్టిన దగ్గర్నుంచి వైరల్ అవుతూనే ఉంది. ఎన్నోసార్ల తమ కూతురితో బయట కనిపించారు ఈ మెగా దంపతులు. కాని వారి లిటిల్ ప్రిన్సెస్ క్లింకార ఫోటో కాని..అందులో ఆ పాప ముఖం కాని కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారు.
మెగా ఫ్యాన్స ఆ పాప ముఖం చూడటానికి ఈగర్ గా వెయిట్ చేస్తుంటే.. వారు మాత్రం పాప ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. అభిమానులు ఆమె గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు కూడా పాప ఫోటో కనిపించకుండా చరణ్ , ఉపాసన జాగ్రత్త పడుతూ వస్తున్నారు. అభిమానులు మాత్రం క్లిన్ కారా ఫేస్ ని ఎప్పుడు చూపిస్తారో అని ఎదురు చూస్తున్నారు.
నాగార్జునను అరెస్ట్ చేయాలని డిమాండ్, మన్మధుడి మెడకు చుట్టుకున్న బిగ్ బాస్ వివాదం
ఇక రీసెంట్ గా ముంబయ్ వెల్లారు రామ్ చరణ్.. చరణ్ వెళ్ళిన రెండు మూడు రోజులకు ఉపాసన క్లింకారను తీసుకుని ముంబయ్ వెళ్లింది. క్లిన్ కారాని ఎత్తుకొని చరణ్ ఇంట్లోకి వెళ్తున్న వీడియో కొన్ని రోజుల క్రితమే వైరల్ గా మారింది. జూన్ 20న క్లిన్ కారా పుట్టింది. తాజాగా క్లిన్ కారాకు ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంగా చరణ్ దంపతులు తమ పాప క్లిన్ కారాతో కలిసి ముంబైలోని మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
రామ్ చరణ్, ఉపాసన తమ పాప క్లిన్ కారాతో పాటు వారి సిబ్బంది కూడా వారితో వెళ్లారు. అయితే రామ్ చరణ్ ఫ్యామిలీతో సహా రావడంతో ఆలయం దగ్గర సందడి వాతావరణం చోటు చేసుకుంది. రామ్ చరణ్ తో ఫోటోలు దిగడానికి అభిమానులుఎగబడ్డారు. అయితే గుడిలో కూడా పాప ఫోటోను కనిపించకుండా.. జాగ్రత్త పడ్డారు మెగా దంపతులు. ప్రస్తుతం వీరు దర్శనాలు చేసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్అవుతున్నాయి.
పల్లవి ప్రశాంత్ ఆవేదన, నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నారంటూ వీడియో
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తనసినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ సినిమాను చేస్తున్నాడు చరణ్. ఈమధ్య వరకూ కర్నాటకలోని మైసూర్ లో ఈమూవీ షూటింగ్ జరిగింది. ఇంకా నెలరోజుల పైనా షెడ్యూల్ పెండింగ్ లో ఉన్నట్టుసమాచారం. ఈ మూవీని త్వరగా కంప్లీట్ చేసి.. నెక్ట్స్ బుచ్చిబాబు సాన కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.