#Salaar పార్ట్ 1 కు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతంటే?

Published : Dec 20, 2023, 01:05 PM IST
 #Salaar పార్ట్ 1  కు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతంటే?

సారాంశం

బద్ధ శత్రువులుగా మారే ఇద్దరు స్నేహితుల కథాంశంతో ‘సలార్‌’ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగాన్ని ‘సలార్‌ పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌’ పేరుతో విడుదల చేయనున్నారు.  


ఈ ఏడాది  ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్‌’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ హంగులతో రూపొందిన ఆ చిత్రం ఆయన మార్కెట్‌కి తగ్గట్టుగానే పలు భాషల్లో విడుదలైంది. కానీ హిందీ దర్శకుడు ఓం రౌత్‌ తీసిన ఆ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఇప్పుడందరి దృష్టి ఈ నెల 22న విడుదలవుతున్న ‘సలార్‌’పైనే ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది.  మనసుని హత్తుకునే స్నేహం, అబ్బురపరిచే యాక్షన్‌ సీక్వెన్స్‌లతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగనుందని తెలుస్తోంది. సినిమా రిలీజ్ కు ముందే బ్లాక్ బస్టర్ గా చెప్పబడుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ప్రభాస్ కు రెమ్యునరేషన్ గా ఎంత తీసుకుని ఉంటాడనేది ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా #Salaar  Ceasefire 1  కోసం ప్రభాస్ కు 100 కోట్లు దాకా పే చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా లాభాల్లో 10% దాకా అదనంగా ఇవ్వబోతున్నారు. బద్ధ శత్రువులుగా మారే ఇద్దరు స్నేహితుల కథాంశంతో ‘సలార్‌’ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగాన్ని ‘సలార్‌ పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌’ పేరుతో విడుదల చేయనున్నారు.  

శ్రుతిహాసన్‌ (salaar heroine) హీరోయిన్‌. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రతినాయకుడు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, దర్శకుడు టీనూ ఆనంద్‌, జగపతి బాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘సలార్‌’.. ‘కేజీయఫ్‌’ యూనివర్స్‌లోకి వస్తుందనే రూమర్స్‌పై ప్రశాంత్‌ నీల్‌ ఇటీవల స్పందించారు. రెండింటికీ సంబంధం ఉండదని స్పష్టం చేశారు. 

ఈ చిత్రం మొదటిరోజు అంటే డిసెంబర్ 22న వరల్డ్‌వైడ్‌గా రూ. 150 నుంచి 160  కోట్ల గ్రాస్‌ను #Salaar ఈజీగా క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే   #Salaar మొదటి వారం రూ. 500 నుంచి 600  కోట్ల గ్రాస్, ఓవరాల్‌గా రూ. 1200  కోట్ల పై చిలుకే గ్రాస్ కలెక్ట్ చేస్తుంది (వరల్డ్‌వైడ్ అన్ని భాషల్లో కలిపి) అని అంచనా.  ఏ మాత్రం బాగుందని టాక్ వచ్చినా ఈ ఫిగర్స్ ని రీచ్ అయ్యిపోవచ్చు. 
 
 డిసెంబర్ 22న ‘సలార్’ మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో తెలుగు, కన్నడంతో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ సినీ ప్రేక్షకులు  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సలార్’ . ‘కె.జి.ఎఫ్'(సిరీస్) దర్శకుడు ప్రశాంత్ నీల్..  ప్రభాస్ తో చేసిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
  
 సలార్ సినిమాకు ఫ్రెండ్‍షిప్ ముఖ్యమైన ఎమోషన్ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “శత్రువుగా మారిన ఇద్దరు స్నేహితుల కథే సలార్. సలార్‌లో ఫ్రెండ్‍షిప్ కోర్ ఎమోషన్. సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్‌లో సగం కథే చెబుతాం. సలార్ మొత్తం కథను రెండు సినిమాలుగా చూపిస్తాం. మేం సృష్టించిన ప్రపంచాన్ని ట్రైలర్లో ప్రేక్షకులు చూపించాము” అని ప్రశాంత్ నీల్ చెప్పారు.  
 
బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు  తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అందుకు కారణం ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్. అలాగే ఆయన క్రేజీ కాంబినేషన్స్.  ఈ క్రమంలో ఈ డిసెంబర్ లో రాబోతున్న ప్రభాస్ సలార్ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి.   ఈ సినిమాకి కేజీఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో, ఖచ్చితంగా ఈ చిత్రం తప్పకుండా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్మకంతో ఉంది ట్రేడ్.   ఈ సినిమా షారుక్ ఖాన్ దుంకి సినిమాతో పోటీ పడాల్సి ఉన్నా కూడా లెక్క చేయటం లేదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?