సల్మాన్, అమీర్ లకు చరణ్ దంపతులు ఆతిథ్యం... జాయిన్ అయిన వెంకీ, పూజా!

Published : Jun 28, 2022, 03:31 PM IST
సల్మాన్, అమీర్ లకు చరణ్ దంపతులు ఆతిథ్యం... జాయిన్ అయిన వెంకీ, పూజా!

సారాంశం

రామ్ చరణ్ దంపతులు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డేలకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ ఫోటోలు ఉపాసన తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.


రామ్ చరణ్(Ram Charan), ఉపాసన దంపతులు సల్మాన్, అమీర్ ఖాన్ లను కలిశారు. వీరిని తమ నివాసానికి ఆహ్వానించడం జరిగింది. వీరిని వేరువేరుగా కలిసినట్లు తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ తో పాటు వెంకటేష్, పూజ హెగ్డే(Pooja Hegde)లను తమ ఇంటికి డిన్నర్ కి పిలిచారు. ఈ ఫోటోలు పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. అమీర్ ఖాన్, సల్మాన్ లతో అద్భుతమైన డిన్నర్ ఈవింగ్స్ అంటూ ఉపాసన కామెంట్ చేశారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆయన కొత్త సినిమా షూటింగ్ ఇక్కడే జరుగుతుంది. 

ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్, హీరోయిన్ పూజా హెగ్డేలను రామ్ చరణ్, ఉపాసన తమ ఇంటికి ఆహ్వానించారు. ఇక సల్మాన్ (Salman Khan)కి వెంకీ మంచి మిత్రులు దీంతో ఆయన కూడా జాయిన్ అయ్యారు. సల్మాన్, వెంకీ కాంబినేషన్ లో మల్టీస్టారర్ రానున్నట్లు వార్తలు వస్తుండగా వీరి మీటింగ్ ఆసక్తి రేపుతోంది. అలాగే మరొక రోజు అమీర్ ఖాన్ (Amir Khan)ని ఉపాసన దంపతులు తమ ఇంటికి ఆహ్వానించారు. అమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చద్దా ఆగష్టు 1న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆయన ప్రొమోషన్స్ బిజీలో ఉన్నారు. దానిలో భాగంగానే రామ్ చరణ్ ని కలిసినట్లు తెలుస్తుంది. 

కాగా రామ్ చరణ్-ఉపాసన తమ 10వ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం ఇటలీ వెళ్లారు. అక్కడ అందమైన ప్రదేశాల్లో యానివర్సరీ జరుపుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో మూవీ చేస్తున్నారు. చిత్రీకరణ జరుపుకుంటుండగా... వచ్చే ఏడాది విడుదల కానుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా భారీ ఎత్తున పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay Net Worth: దళపతి విజయ్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా? లగ్జరీ కార్లు, ఖరీదైన బంగళాలు.. టీవీకే చీఫ్ లెక్కలు ఇవే!
Vijay Trisha Movies: విజయ్‌, త్రిష కలిస్తే బాక్సాఫీసుకి పూనకాలే.. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలివే