భారీ ధ‌ర ప‌లుకుతున్న నిఖిల్ సినిమా, కార్తికేయ‌-2 థియేట్రిక‌ల్ రైట్స్‌ అన్ని కోట్లా....?

Published : Jun 28, 2022, 01:58 PM IST
భారీ ధ‌ర ప‌లుకుతున్న నిఖిల్ సినిమా, కార్తికేయ‌-2 థియేట్రిక‌ల్ రైట్స్‌ అన్ని కోట్లా....?

సారాంశం

యంగ్ హీరో నిఖిల్ సినిమాలకు డిమాండ్ పెరిగింది. పెద్దగా సక్సెస్ లు లేకపోయినా.. నిఖిల్ డిమాండ్ మాత్రం పెరుగుతుంది. తాజాగా కార్తికేయా2 మూవీకి అవుతున్న బిజినెస్ దానికి ఉదాహరణగా చెప్పవచ్చు. 

యంగ్ స్టార్ హీరో నిఖిల్ వ‌రుస సినిమాల‌తో జోరుమీదున్నాడు. అర్జున్ సుర‌వ‌రం త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు నిఖిల్ నుంచి మ‌రో సినిమా రాలేదు. ఈ మూడేళ్ళ గ్యాప్‌ను పూర్తి చేసేందుకు నిఖిల్ పరుగులు పెడుతూ.. సినిమాలకు కంప్లీట్  చేస్తున్నాడు. అంతే కాదు వ‌రుస‌గా సినిమాల‌కు సైన్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో కార్తికేయ-2 ఒక‌టి. చందు ముండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా కార్తికేయ మూవీకి  సీక్వెల్‌గా తెర‌కెక్కింది. 

2014లో వ‌చ్చిన‌ కార్తికేయ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే. 6 కోట్ల‌తో నిర్మించిన ఈ సినిమా దాదాపుగా 20 కోట్లకు పైనే క‌లెక్ష‌న్లు సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దాదాపు 8 ఏళ్ళ త‌ర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెర‌కెక్కింది. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది.

తాజాగా  కార్తికేయా2 సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇది వ‌ర‌కే ఈ మూవీ నుండి విడుద‌లైన ప్రమోషనల్ వీడియోస్, పోస్టర్స్, పాత్ర‌ల ప‌రిచ‌య వీడియో, టీజ‌ర్ ఇలా ప్ర‌తీది ప్రేక్ష‌కులలో విప‌రీత‌మైన ఆస‌క్తిని క్రియేట్ చేశాయి. ఎప్పుడెప్పుడు సినిమా విడుద‌ల‌వుతుందా అని సినీ ప్రేమికులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో కార్తికేయ‌-2 థియేట్రిక‌ల్ హ‌క్కులు భారీ ధ‌ర‌కు ప‌లుకుతున్నాయ‌ట‌. రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి ఈ సినిమాకు దాదాపు 14కోట్ల‌కు పైగానే రేటు ప‌లుకుతున్నాయ‌ట‌. 

నిఖిల్ సినిమాకు ఇప్పటి వరకూ..  ఈ స్థాయిలో రేటు ప‌ల‌కలేదు. ఇప్పుడు ఇంత రేటు రావడం అనేది  విశేషం అనే చెప్పాలి. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈమూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌ల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. కాల భైర‌వ సంగీతం అందించిన‌ ఈ చిత్రం జూలై 22న తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్‌, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుద‌ల కానుంది.

PREV
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్