
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఓ పాన్ ఇండియా చిత్రం మొదలెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంభందించి రోజుకో అప్డేట్ వస్తూ అభిమానులను ఆనందపరుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ 50వ చిత్రంగా, అలాగే రామ్ చరణ్ 15వ చిత్రంగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ సంగీత సారథ్యంలో ఇటీవల ప్రారంభమైంది. తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం.
అందుతున్న సమాచారం మేరకు ఈ క్రేజీ ప్రాజెక్టుకు ‘విశ్వంభర’ అనే టైటిల్‌ను ఫైనలైజ్ చేసారట. డా. సి.నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ్ అవార్డు తెచ్చి పెట్టిన కవితా సంకలనం పేరు కూడా ‘విశ్వంభర’. దాంతో ఈ టైటిల్ పై సాహిత్యాభిమానుల దృష్టి కూడా పడింది.చిత్రంని బుధవారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. శంకర్ ఆధ్వర్యంలో ఆల్రెడీ టెస్ట్ షూట్స్ మొదలైనట్లుగా కూడా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. బుధవారం పూజా కార్యక్రమాల అనంతరం షూటింగ్ డిటైల్స్‌ను నిర్మాతలు ప్రకటించనున్నారు.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ రోజు నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు సమాచారం. కియరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. కియారా గతంలో తెలుగులో భరత్ అనే నేనుతో పాటు వినయ విధేయ రామలోను తన అందచందాలతో అదరగొట్టింది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.