142 మందితో రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ వాట్సాప్‌ గ్రూప్‌... అందులో వీళ్లంతా ఏం చేస్తారో తెలుసా?

By Galam Venkata RaoFirst Published Jul 3, 2024, 12:24 PM IST
Highlights

టాలీవుడ్‌ టాప్‌ హీరోస్‌ రామ్ చరణ్, అల్లు అర్జున్‌, రానా దగ్గుబాటి సహా మరో 142 మంది నటులతో వాట్సాప్ గ్రూప్‌ ఉందట. ఆ గ్రూప్‌లో మంచు లక్ష్మి కూడా ఉన్నారట. ఈ గ్రూప్‌ను ఎందుకు క్రియేట్ చేశారో కూడా ఆమె వెల్లడించింది.

టాలీవుడ్‌ పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగింది. బాలీవుడ్‌ను కూడా శాసించే స్థాయికి చేరింది తెలుగు చిత్ర పరిశ్రమ. తెలుగు హీరోలు, నటులు బాలీవుడ్‌కి మించిన సినిమాలతో పాన్‌ ఇండియా లెవెల్‌లో దూసుకెళ్తున్నారు. అయితే ఎంత ఎదిగినా, ఎన్ని గొడవలు, విభేదాలున్నా.. టాలీవుడ్‌ ఒక్కటిగానే కనిపిస్తుంటుంది. పరస్పరం విమర్శలు చేసుకునే హీరోలు, హీరోయిన్లు, యాక్టర్లు సైతం.. కష్టమొస్తే ఒక్కటవుతారు. ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటారు. ఒకరి సక్సెస్‌లో మిగతావారూ భాగమవుతూ ఉంటారు టాలీవుడ్‌ స్టార్స్‌...

కొందరు హీరోల ఫ్యాన్స్‌ అయితే బయట యుద్ధమే చేస్తుంటారు. సోషల్‌ మీడియాలో విపరీతంగా ఒకరిపై ఒకరు ట్రోల్స్‌ చేసుకుంటూ ఉంటారు. అయితే, ఫ్యాన్స్‌ మధ్య ఇంత జరుగుతుంటే.. ఆ హీరోలు మాత్రం ఒక్కటిగానే ఉంటున్నారట. బయట అభిమానులు యుద్ధం చేస్తుంటే.. లోలోపల ఆ హీరోలు మాత్రం ఒకరికొకరు వారి అవసరాల్లో సాయం చేసుకుంటూ ఉంటున్నారట. 

అయితే, తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్‌లో టాప్‌ హీరోలకు సంబంధించిన ఓ విషయం బయటకు వచ్చింది. ఈ విషయాన్ని తెలుగు నటి, మంచు మోహన్‌ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఓ ఇంటర్‌ వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. అదేంటంటే...

టాలీవుడ్‌ టాప్‌ హీరోస్‌ రామ్ చరణ్, అల్లు అర్జున్‌, రానా దగ్గుబాటి సహా మరో 142 మంది నటులతో వాట్సాప్ గ్రూప్‌ ఉందట. ఆ గ్రూప్‌లో మంచు లక్ష్మి కూడా ఉన్నారట. ఈ గ్రూప్‌ను ఎందుకు క్రియేట్ చేశారో కూడా ఆమె వెల్లడించింది.

సిద్ధార్థ్ కన్నన్‌తో జరిగిన ఇంటర్‌వ్యూలో మంచు లక్ష్మీ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ప్రముఖ తెలుగు నటీనటుల మధ్య ఒక వాట్సాప్ గ్రూప్ ఉందని తెలిపారు. ఆ గ్రూప్‌లో తనతో పాటు 142 మంది హీరోలు, హీరోయిన్‌లు, నటులు ఉన్నారని చెప్పారు. అదే గ్రూప్‌ మెగా హీరో రామ్‌ చరణ్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రానా దగ్గుబాటి లాంటి ప్రముఖ హీరోలు ఉన్నారని చెప్పింది మంచు లక్ష్మి. తెలుగు చిత్ర పరిశ్రమలోని నటీనటుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించేందుకే ఈ గ్రూప్‌ ఉందని ఆమె వెల్లడించింది. యాక్టర్లు తమ లేటెస్ట్‌ సినిమాలను ప్రమోట్ చేయడానికి, రాబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించి విషయాలను మాట్లాడటానికి ఈ గ్రూప్‌ను వినియోగిస్తారని తెలిపింది. 

అలాగే, కొత్త సినిమాల టీజర్లు, ట్రైలర్లను గ్రూప్‌లో పంచుకుంటారని, ఒకరి సినిమా గురించి మరొకరు ప్రచారం చేయడం లాంటివి చేస్తారని మంచు లక్ష్మి తెలిపారు. నటీనటుల మధ్య ఐక్యతాభావాన్ని పెంపొందించేందుకు, శత్రుత్వాన్ని పోగొట్టేందుకు ఈ గ్రూప్‌ ఏర్పాటు చేశామన్నారు.

‘‘ఆ వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నవారందరూ నటులే. వారంతా ఏం చేస్తారంటే.. ఎవరిదైనా సినిమా, టీజర్‌ రిలీజ్ ఉంటే.. దాన్ని గ్రూప్‌లో వేస్తారు. దాన్ని మేమందరం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం. అందుకే ‘ఈ శత్రుత్వం చాలు’ అంటూ ఈ గ్రూప్‌ని క్రియేట్ చేశాం’’ అని మంచు లక్ష్మీ తెలిపారు. 

అలాగే, ఈ బృందాన్ని తన హృదయానికి దగ్గరగా ఉంచుకుంటానని మంచు లక్ష్మీ పేర్కొన్నారు. రానా, రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. తామంతా కలిసి పెరిగామని చెప్పారు. తామంతా కలిసే ఉంటామని... తమ గ్రూప్‌ని మరింత పెంచామని... ఇందుకు చాలా గర్వపడుతున్నానని లక్మీ అన్నారు.

అదే ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మరో ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లమని తనకు రానా దగ్గుబాటి సలహా ఇచ్చాడట. అలాగే, ముంబైకి వెళ్లినప్పుడు రకుల్ ప్రీత్ సింగ్‌తో తాను ఎలా గడిపారో ప్రస్తావించింది. తాను రామ్ చరణ్ ఇంట్లోనే ఉండేదాన్నని... అయితే దాని గురించి బయట చెప్పొవద్దని రామ్ చరణ్ చెప్పాడని లక్ష్మి వెల్లడించింది.

 

Actress Manchu Lakshmi says they have WhatsApp group among artists including , Rana and 142 others 👌

Aa WhatsApp group lo active vunnava anna pic.twitter.com/vfe1yJCvuC

— Joker (@JokerSpeakz)

మంచు లక్ష్మి యునైటెడ్ స్టేట్స్‌లో తన కెరీర్‌ను ప్రారంభించింది. అక్కడ ఆమె ‘లాస్ వెగాస్’, ‘బోస్టన్ లీగల్’, ‘డెస్పరేట్ హౌస్‌వైవ్స్’, ‘డెడ్ ఎయిర్’ లాంటి కొన్ని ప్రాజెక్ట్‌లలో నటించింది. ఆమె ఇండియా తిరిగి వచ్చాక... తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆమె చివరిగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘యక్షిణి’లో కనిపించింది.

click me!