Latest Videos

వీడియో : సమంత చేసిన ఈ విన్యాసం చూసి షాక్ అవుతున్నారు

By Surya PrakashFirst Published Jul 3, 2024, 7:37 AM IST
Highlights

సమంత రెగ్యులర్ గా తన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉటుంది. ఇటీవల హెల్త్ గురించి పాడ్ కాస్ట్ వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంది. 


 సమంత గత కొంతకాలంగా  తన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది. అలాగే  కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.  మయోసైటిస్ నుంచి సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా  ఓ సినిమాని ప్రకటించింది. త్వరలోనే సమంత మళ్ళీ వెబ్ సిరీస్, సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే సమయంలో   సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది సమంత. తాజాగా ఆమె షేర్ చేసిన తన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇది చూసిన వాళ్లు షాక్ అవుతున్నారు. మెచ్చుకుంటున్నారు. 

Samantha performing intense movements pic.twitter.com/M4dPBkPogu

— CRUSH SLOT (@CrushSlot)

నిజానికి సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది కానీ తన జిమ్ వర్కవుట్స్‌కు మాత్రం బ్రేక్ ఇవ్వడం లేదు.  తన శరీరాన్ని మరింత స్ట్రాంగ్‌గా చేస్తుంది.. ఇప్పటికే మానసికంగా చాలా స్ట్రాంగ్ అని నిరూపించుకున్న స‌మంత.. తను ఫిజికల్‌గానూ అంతే బలంగా ఉన్నానని నిరూపించుకునే పనిలో పడిపోయింది.   జిమ్‌లోనే ఉంటూ చమటలు కక్కించే సమంత ఇప్పుడు ఈ వీడియోలో విన్యాసంతో అందరి ఫేవరెట్ గా మరోసారి మారిపోయింది. 

సమంత రెగ్యులర్ గా తన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉటుంది. ఇటీవల హెల్త్ గురించి పాడ్ కాస్ట్ వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంది. అలాగే ఆమె షేర్ చేసే ఈ వీడియోలు తో ఇన్‌స్పిరేషన్‌గానూ నిలుస్తుంది సమంత.  ఈమె శ్ర‌మిస్తున్న తీరుతో ఆశ్చర్యపోతున్నారు. ఏదైమైనా  మ‌యోసైటిస్ బారిన పడిన తర్వాత సమంతలో చాలా మార్పులు వచ్చాయి.  ఇకపై కేవలం కెరీర్‌పైనే ఫోకస్ చేయాలని చూస్తుంది కూడా. ఏదేమైనా విడాకుల తర్వాత తనను తాను ఎప్పటికప్పుడు ఫిజికల్‌, మెంటల్‌గా స్ట్రాంగ్ అయ్యేలా చూసుకుంది.

ఇక తాను స్టేజ్‌ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతోన్నట్లు హీనా ఖాన్‌ ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో సినీ ఇండస్ట్రీలోని ప్రముఖలు ఆమెకు ధైర్యాన్నిస్తున్నారు. తాజాగా హీనా ఖాన్‌ను ఉద్దేశిస్తూ సమంత (Samantha) పోస్ట్‌ పెట్టారు. హీనాకు సంబంధించిన వీడియో పోస్ట్‌ చేసిన సమంత ‘నీకోసం నేను ప్రార్థిస్తాను. ధైర్యంగా ఉండు’ అని రాశారు. దానికి వారియర్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించారు. ఈ పోస్ట్‌కు హీనా (Hina Khan) స్పందిస్తూ.. ‘సమంత మీరు అన్నిట్లోనూ స్టార్‌. జీవితం విసిరిన సవాళ్లను హ్యాండిల్ చేసిన విధానం అద్భుతం. మీ గురించి తెలుసుకొని ఎంతో స్ఫూర్తి పొందాను. మీ ప్రేమ, ఆశీర్వచనాలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

click me!