Latest Videos

కృతి శెట్టికు మరో ఆఫర్, సూపర్ స్టార్ సరసన?

By Surya PrakashFirst Published Jul 3, 2024, 7:03 AM IST
Highlights

ఈ చిత్రం తెలుగు, మలయాళంతో పాటు హిందీ, తమిళంలోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. 


ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది కృతి శెట్టి. ఈ ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కృతి .  బుచ్చి బాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.   తొలి సినిమాతోనే తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ అమ్మడు. ఉప్పెన సినిమా హిట్ అవ్వడంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఉప్పెన తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన కృతి. ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించి ఆకట్టుకుంది. ఆతర్వాత బంగార్రాజు సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న కృతికి ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ పడ్డాయి. దాంతో ఇప్పుడు ఆఫర్స్ కరువయ్యాయి. అయితే తాజాగా ఆమెకు ఓ స్టార్ హీరో సరసన ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు...దుల్కర్. 

మళయాళ సూపర్ స్టార్  దుల్కర్ సల్మాన్ తెలుగులో అభిమానులు గట్టిగానే ఉన్నారు. ఇక్కడ వరస సినిమాలు చేస్తున్నారు.  ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌గా  దుల్కర్ సల్మాన్ ని అన్ని మీడియాలు పొగుడుతూంటాయి. అందుకు తగ్గట్లే సినిమాలో ఆయన నటనే హైలెట్ గా సాగుతూంటుంది. మొదట్లో మళయాళ చిత్రాలు మాత్రమే చేసినా ఇప్పుడు తెలుగులో ఎక్కువ ప్రాజెక్టులు చేస్తున్నారు. ఆ డబ్బింగ్ వెర్షన్స్ ఎలాగూ తన మాతృభాషకు వెళ్తాయి. కాబట్టి సమస్యలేదు. ఇలా దుల్కర్ కు ప్రత్యేకమమైన డ్యూయిల్ మార్కెట్ ఉండటం నిర్మాతలకు ప్లస్ అవుతోంది. ప్రస్తుతం  'సార్' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా  ‘లక్కీ భాస్కర్’ అనే టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు. 

ఇక ఇప్పుడీ హీరో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టితో రొమాన్స్ చేయబోతున్నారు.  ‘కాంత’ సినిమా కోసం ఆమెను అడుగుతున్నారు. ‘కాంత’ సినిమా కోసం దుల్కర్, రానా చేతులు కలిపారు. రానాకు చెందిన ‘స్పిరిట్ మీడియా’ బ్యానర్, దుల్కర్ బ్యానర్ ‘వేఫారర్ ఫిల్మ్స్’ రెండూ కలిసి ఈ ‘కాంత’ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాలో దుల్కర్ హీరోగా నటించనుండగా... రానా కూడా ఓ కీలక పాత్ర పోషిస్తాడని తెలుస్తోంది. ఈ ఇద్దరు హీరోలు కలిసి నిర్మించే ఈ మూవీ భారీ బడ్జెట్‍తో పాన్ ఇండియా రేంజ్‍లో ఉండనుంది. 

 కాగా ఈ చిత్రం తెలుగు, మలయాళంతో పాటు హిందీ, తమిళంలోనూ విడుదలయ్యే అవకాశం ఉంది.  'నీలా' మూవీ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ కోసం ‘హంట్ ఫర్ వీరప్పన్’ అనే డాక్యుమెంటరీని రూపొందించాడు సెల్వరాజ్. ఇది నెట్‍ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అయ్యింది. ఆంగ్ లీ, ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమాలకు గతంలో సెల్వరాజ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఇదిలా ఉండగా 'కాంత' మూవీ లో వివిధ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటించే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‍డేట్లు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

click me!