
తెలుగులో లక్కీ హీరోయిన్ గా.. పేరు తెచ్చుకుంది రకుల్. టాప్ లీగ్ లో దూసుకెళ్తున్న రకుల్ తెలుగులో హిట్ హీరోయిన్ గా ఇక్కడ పేరు తెచ్చుకున్నా... తమిళంలో ఇంకా అమ్మడుకు సరైన బ్రేక్ దొరకలేదు. అయితే ఇప్పుడిప్పుడే తమిళ తంబీలు కూడా రకుల్ అందాలకు దాసోహం అంటున్నారు. దీంతో ఈ యేడు తమిళంలో కూడా రకుల్ తన సత్తా చాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
తమిళంలో సూర్య సరసన ఆఫర్ కొట్టేసింది రకుల్. ఇప్పటికే కార్తీతోనూ సినిమాలో అవకాశం దక్కించుకున్న రకుల్ తాజాగా మలో తమిళ సూపర్ హీరోతో రొమాన్స్ చేయనుంది. వెరైటీ కథలు ఎంచుకుంటూ... తనదైన శైలిలో సినిమాలు తీసే... ఓ హీరో సరసన ఇప్పుడు రకుల్ తో చేసేందుకు ప్లాన్ చేశారట.
తమిళంలో విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో సామీ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ఈ చిత్రంలో త్రిషను మరోసారి కన్ఫమ్ చేశారు. ఇక మరో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ ను సంప్రదించారని తెలిసింది. శిబూ తమీన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. రకుల్ ఓకే చేస్తే... విక్రమ్ సరసన నటించడం ఖాయం.