నాని"నేను లోకల్" సక్సెస్ అయిపోయింది.. ఇక "నేను అమెరికాలో.."

Published : Feb 22, 2017, 09:06 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
నాని"నేను లోకల్" సక్సెస్ అయిపోయింది.. ఇక "నేను అమెరికాలో.."

సారాంశం

వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న నాని నేను లోకల్ సక్సెస్ తో నాని ఖాతాలో ఆరు సినిమాలు మళ్లీ రెడీ అవుతున్న నేచురల్ స్టార్ డీవీవీ దానయ్య నిర్మాతగా నాని చిత్రం ఫస్ట్ లుక్ ఈ 24న..

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.3గా నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. ఫిబ్రవరి 24 హీరో నాని పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌ కూడా చేయనున్నారు.

 

ఈ సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ - ''ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ అమెరికాలో జరుగుతోంది. మార్చి 10 వరకు ఈ షెడ్యూల్‌ వుంటుంది. మా హీరో నాని పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 24న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేయడంతోపాటు టైటిల్‌ని కూడా ఎనౌన్స్‌ చెయ్యబోతున్నాం'' అన్నారు. 

 

నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

 

ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., రచన, దర్శకత్వం: శివ నిర్వాణ. 

PREV
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్