Rakul Preeth singh:ప్రియుడుతో పాటు కెమెరా కంటికి చిక్కిన రకుల్.. సెలెబ్రేషన్స్ ముగించుకొని వస్తూ...

Published : Jan 05, 2022, 04:26 PM IST
Rakul Preeth singh:ప్రియుడుతో పాటు కెమెరా కంటికి చిక్కిన రకుల్.. సెలెబ్రేషన్స్ ముగించుకొని వస్తూ...

సారాంశం

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth Singh)ముంబై ఎయిర్ పోర్ట్ లో ప్రియుడు జాకీ భగ్నాని తో పాటు కనిపించారు. విదేశీ ట్రిప్ ముగించుకొని వస్తున్న ఈ జంట కెమెరా కంటికి చిక్కారు. రకుల్, జాకీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

డిసెంబర్ 25 జాకీ భగ్నాని  (Jackky Bhagnani)బర్త్ డే నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం రకుల్ ఆయనతో పాటు విదేశాలకు వెళ్లారు. అక్కడ జాకీ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో పాటు న్యూ ఇయర్ (New Year 2022) వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అధికారిక సమాచారం లేకున్నప్పటికీ రకుల్, జాకీ లండన్ వెళ్లినట్లు సమాచారం. ఇక ప్రదేశం ఏదైనా అన్ లిమిటెడ్ జాయ్ ఎంజాయ్ చేసి వచ్చారు జంట. జనవరి 5 నేడు ఉదయం రకుల్, జాకీ ముంబై ఎయిర్ పోర్ట్ నుండి బయటికి వస్తుండగా మీడియా చుట్టుముట్టారు. వారిని కెమెరాలలో బంధించారు. 

రకుల్ ప్రీత్ తన బర్త్ డే పురస్కరించుకుని అక్టోబర్ 10న జాకీతో తన రిలేషన్ బయటపెట్టారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో పాటు జాకీని తన బాయ్ ఫ్రెండ్ గా లోకానికి పరిచయం చేసింది. ఇక రకుల్ రిలేషన్షిప్ గురించి తెలుసుకున్న కొందరు షాక్ తిన్నారు. అలాగే ఆమెకు బర్త్ డే విషెస్ తో పాటు కంగ్రాట్స్ తెలియజేశారు. ఇక ఎవరు ఈ జాకీ భగ్నాని అంటూ తెలుసుకునే ప్రయత్నం చేశారు. 

జాకీ బాలీవుడ్ లో నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఇతడు సీనియర్ నిర్మాత వషు భగ్నాని కుమారుడు. కొన్నాళ్లుగా రకుల్ హిందీలో బిజీ అయ్యారు. ఎక్కువగా ముంబైలో ఉంటున్న రకుల్ కి జాకీతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇక త్వరలో పెళ్లి అంటూ అనేక కథనాలు వెలువడుతున్నాయి. రకుల్ హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్న నేపథ్యంలో దానికి ఇంకా సమయం ఉందని చెబుతున్నారు. 

గతంలో రకుల్ పై అనేక ఎఫైర్ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. జాకీని బాయ్ ఫ్రెండ్ గా ప్రకటించి రకుల్ సదరు రూమర్స్ కి చెక్ పెట్టింది. ఇక తెలుగులో రకుల్ దాదాపు ఫేడ్ అవుట్ అయ్యారు. ఆమె రీసెంట్ చిత్రాలు చెక్, కొండపొలం పరాజయం పొందాయి. అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. అయితే హిందీలో రకుల్ అరడజనుకు పైగా చిత్రాలు చేస్తున్నారు. కొన్ని చిత్రీకరణ జరుపుకుంటుండగా.. కొన్ని చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. రకుల్ బాలీవుడ్ లో ఈ రేంజ్ లో అవకాశాలు అందిపుచ్చుకుంటుందనీ ఎవరూ ఊహించలేదు.  

Also read HBD Deepika Padukone: వయసు పెరిగేకొద్దీ వైన్ బాటిల్ లా.. క్రేజ్ పెంచుకుంటున్న ప్రభాస్ హీరోయిన్

మరోవైపు రకుల్ తరచుగా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2020లో ముంబై ఎన్సీబీ అధికారులు ఆమెను విచారించారు. దీపికా పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్దా కపూర్ లతో పాటు ఎన్సీబీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇక గత ఏడాది డ్రగ్స్ కేసు మరోమారు తెరపైకి వచ్చింది. హీరో రానా, రవితేజ(Raviteja), తరుణ్, దర్శకుడు పూరి, ఛార్మిలతో పాటు రకుల్ డ్రగ్స్ ఆరోపణలపై ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. 

Also read AP Ticket Prices: కొడాలి నాని ఎవరో తెలియదు... వర్మ కౌంటర్
 

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ