చరణ్ ని వదిలేయ్, తారక్ జోలికి రావద్దు.. రకుల్ కి ఫ్యాన్స్ వార్నింగ్!

Published : Nov 20, 2018, 11:43 AM ISTUpdated : Nov 20, 2018, 12:34 PM IST
చరణ్ ని వదిలేయ్, తారక్ జోలికి రావద్దు.. రకుల్ కి ఫ్యాన్స్ వార్నింగ్!

సారాంశం

టైమ్ బాగోకపోతే అరటిపండు తిన్నా.. పన్ను విరుగుతుందని ఒక సామెత ఉంది.. పాపం ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి కూడా అలానే తయారైంది. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోయింది. 

కానీ ఇప్పుడు తెలుగులో రకుల్ కి ఒక్క సినిమా ఛాన్స్ కూడా లేదు. ఇది ఇలా ఉంటే.. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో నెటిజన్లు రకుల్ ని బాగా టార్గెట్ చేస్తున్నారు. తన డ్రెస్సింగ్ పై ఓ సారి ట్రోల్ చేయగా.. మంచు లక్ష్మితో లెస్బియన్ టైప్ లో ఓ ఫోటో దిగి ట్రోలింగ్ కి గురైంది.

తాజాగా మరోసారి నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. దానికి కారణమేమిటంటే.. తాజాగా రాజమౌళి 'RRR' సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రకుల్  చిత్రబృందానికి తన విషెస్ తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది. అంతే.. ఈ పోస్ట్ ని మరోలా అర్ధం చేసుకున్న నెటిజన్లు రాజమౌళి సినిమాలో హీరోయిన్ వేషం కోసం ఆమె ఇలా బిస్కెట్లు వేస్తోందని కామెంట్లు చేస్తున్నారు.

నువ్ ఎంత పొగిడినా రాజమౌళి నీకు ఛాన్స్ ఇవ్వడని కొందరు కామెంట్లు పెడుతుంటే.. దయచేసి మా చరణ్ ని వదిలేయ్ అని ఆయన అభిమానులు, మా తారక్ జోలికి రావొద్దంటూ ఆయన ఫ్యాన్స్ రకుల్ కి వార్నింగ్ లు ఇస్తున్నారు. ఒకప్పుడు ఈ హీరోల సరసన నటించిన ఈ భామకి ఇప్పుడు వాళ్లతో నటించే ఛాన్స్ వచ్చినా.. ఫ్యాన్స్ ఊరుకునేలా లేరు. 
 
విజయ్ దేవరకొండ చేసిన పనితో టీమ్ అప్సెట్!

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Feb 27: నట్టింట్లో కుంపటి పెట్టిన భాగ్యం.. రామరాజుకు మొత్తం చెప్పేసింది
Thaai Kizhavi Review: రాధిక అరాచకం... `తాయ్ కిళవి` రివ్యూ, సినిమా ఎలా ఉందంటే?