సల్మాన్ ఖాన్ ని చంపేస్తా.. గ్యాంగ్ స్టర్ కి చెందిన వ్యక్తి బెదిరింపులు!

Published : Nov 20, 2018, 11:03 AM IST
సల్మాన్ ఖాన్ ని చంపేస్తా..  గ్యాంగ్ స్టర్ కి చెందిన వ్యక్తి బెదిరింపులు!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని తన గాడ్ ఫాదర్ గా భావించే ఓ వ్యక్తి చంపేస్తానని బెదిరించడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. 

అతడు సల్మాన్ ఖాన్ ను గాడ్ ఫాదర్ గా భావించేవాడు. అవకాశాల  విషయంలో సల్మాన్ ఖాన్ సహాయం తీసుకోవాలని భావించిన అతడు సల్మాన్ పెర్సనల్ మ్యానేజర్ కి ఫోన్ చేసి సల్మాన్ నెంబర్ కావాలని అడిగాడు. దానికి ఆయన అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన సదరువ్యక్తి పెర్సనల్ మ్యానేజర్ ని తిట్టడం మొదలుపెట్టాడు.

అంతేకాదు.. సల్మాన్ ఖాన్ ని చంపేస్తానని బెదిరించాడు. అక్కడితో ఆగకుండా సల్మాన్ ఖాన్ తండ్రి సలీంఖాన్ కి కూడా ఫోన్ చేసి సల్మాన్ నెంబర్ అడిగాడు. దానికి ఆయన కూడా ఒప్పుకోకపోవడంతో తాను గ్యాంగ్ స్టర్ ఛోటా షకీల్ దగ్గర పని చేస్తుంటానని తెలిపాడు.

అయినప్పటికీ ఆయన నెంబర్ ఇవ్వడానికి నిరాకరించడంతో అతడిని కూడా బెదిరించాడు. కాగా సల్మాన్ తరఫున అందిన ఫిర్యాదు మేరకు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పోలీసులు యూపీకి చెందిన గులాబన్బీ ఉరఫ్ షేర్ ని నిందితునిగా గుర్తించారు.  

PREV
click me!

Recommended Stories

Venkatesh Top 10 Movies: తప్పక చూడాల్సిన వెంకటేష్‌ టాప్‌ 10 మూవీస్‌.. ఇలాంటి రికార్డు ఉన్న ఒకే ఒక్క హీరో
Illu Illalu Pillalu Today 13 డిసెంబర్ ఎపిసోడ్ : రామరాజు ముందు నోరు విప్పిన చందు, అమూల్య బలి, భర్తను బకరా చేసిన వల్లి