సినిమా హోర్డింగ్ పై ఉరేసుకున్న మనిషి...అంతా షాక్

Published : Nov 20, 2018, 11:17 AM IST
సినిమా హోర్డింగ్ పై ఉరేసుకున్న మనిషి...అంతా షాక్

సారాంశం

మనం రోడ్డుమీద వెళ్తున్నప్పుడు చుట్టుప్రక్కల అనేక పోస్టర్స్, హోర్డింగ్స్ కనపడుతూంటాయి. ముఖ్యంగా సినిమావాళ్లు తమ కొత్త చిత్రాల ప్రమోషన్స్ కు భారీ హోర్డింగ్స్ వాడుతూంటారు.

మనం రోడ్డుమీద వెళ్తున్నప్పుడు చుట్టుప్రక్కల అనేక పోస్టర్స్, హోర్డింగ్స్ కనపడుతూంటాయి. ముఖ్యంగా సినిమావాళ్లు తమ కొత్త చిత్రాల ప్రమోషన్స్ కు భారీ హోర్డింగ్స్ వాడుతూంటారు. అలా ముంబైలో ది డార్క్ సైడ్ ఆఫ్ లైఫ్ ..ముంబై సిటీ అనే హింది చిత్రం హోర్డింగ్స్ సైతం ముంబైలోని ఓషివరా సిగ్నల్ దగ్గర  పెట్టారు. అయితే ఆ హోర్డింగ్ కు ఊహించని విధంగా ఓ మనిషి ఉరేసుకుని కనపడటం అందరని షాక్ కు గురి చేసిందట.

దాంతో జనాలు ఆగి చూడటం మొదలెట్టారు. కాస్సేపటికి పరీక్షగా చూస్తే...అది ఓ డమ్మి మనిషి బొమ్మ అని అర్దమై ఊపిరి పీల్చుకున్నారు. తమ సినిమా ప్రమోషన్ కోసం నిర్మాతలు చేసిన జిమ్మక్కు అని తెలిసింది. తమ సినిమాలో పేరున్న ఆర్టిస్ట్ లు లేకపోవటంతో జనాల అటెన్షన్ ని గ్రాబ్ చేయటానికి ఇలా ప్రమోషన్ మొదలెట్టారన్నమాట. ఇంతవరకూ బాగానే ఉంది కానీ..మరీ ప్రమోషన్ కోసం మన భావోద్వేగాలతో ఆడుకోవటం ఎంతవరకూ సబబు అనేది చర్చగా మారింది. 

ఇక ఈ సినిమా ముంబై మహానగరంలో ఉండే వ్యక్తుల జీవితంలోని ఎమోషనల్, ఫైనాన్సియల్ స్ట్రగుల్స్ ని ఏడు వివిధ దశల్లో చూపిస్తుందిట. నవంబర్ 23న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు మహేష్ భట్...నటుడుగా కనిపించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్