అఫీషియల్ : బాలీవుడ్ నటుడితో ప్రేమలో రకుల్ ప్రీత్ సింగ్

pratap reddy   | Asianet News
Published : Oct 10, 2021, 02:38 PM IST
అఫీషియల్ : బాలీవుడ్ నటుడితో ప్రేమలో రకుల్ ప్రీత్ సింగ్

సారాంశం

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నేడు తన 31వ బర్త్ డే జరుపుకుంటోంది. ఈ పుట్టినరోజు రకుల్ ప్రీత్ సింగ్ కు మరింత మెమొరబుల్ గా మారిపోయింది.

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నేడు తన 31వ బర్త్ డే జరుపుకుంటోంది. ఈ పుట్టినరోజు రకుల్ ప్రీత్ సింగ్ కు మరింత మెమొరబుల్ గా మారిపోయింది. టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోల చిత్రాల్లో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. ఇకపై తన వ్యక్తిగత జీవితంలో కూడా రకుల్ కీలక అడుగులు వేయబోతోంది. 

నేడు తన పుట్టినరోజు సందర్భంగా.. తాను బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు Rakul Preet Singh ప్రకటించింది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు. జాకీ భగ్నానీ బాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్నారు. జాకీ వ్యాపార వేత్త కూడా. పూజా ఎంటర్టైన్మెంట్స్ అధినేత వశు భగ్నానీ తనయుడే ఈ జాకీ భగ్నానీ. 

'థ్యాంక్ యు మై లవ్.. ఈ ఏడాది నాకు దొరికిన అతిపెద్ద గిఫ్ట్ నువ్వు. నన్ను సంతోషంగా ఉంచుతున్నందుకు, నా జీవితానికి రంగులద్దుతున్నందుకు థ్యాంక్యూ. ఇద్దరం కలసి జీవితంలో మరిన్ని అనుభూతుల్ని పంచుకుందాం' అంటూ రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ పెట్టింది. తన ప్రియుడితో ఉన్న పిక్ ని షేర్ చేసింది. 

Also Read: MAA Elections: ముంబై నుంచి ఓటు వేయడానికి వచ్చిన జెనీలియా.. ప్రకాష్ రాజ్ కి షాక్

'నీవు లేకుండా ఇన్ని రోజులు గడిచేవి కాదు. నీతో షేర్ చేసుకోకుండా రుచికరమైన ఆహారం కూడా తినాలనిపించదు. మోస్ట్ బ్యూటిఫుల్ సోల్ కి బర్త్ డే విషెస్. నీవే నా ప్రపంచం. హ్యాపీ బర్త్ డే మై లవ్' అంటూ జాకీ భగ్నానీ రకుల్ కి బర్త్ డే విషెస్ తెలిపాడు. 

 

గత కొంతకాలంగా రకుల్, జాకీ ముంబై లో డిన్నర్ డేట్ లో కనిపిస్తూ వచ్చారు.కానీ తమ రిలేషన్ గురించి మాత్రం మౌనం వహించారు. తాజాగా ప్రకటనతో వీరిద్దరూ ఘాడమైన ప్రేమలో ఉన్నారని కంఫర్మ్ అయింది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Rajinikanth : 25 ఏళ్ల పాటు జపాన్ లో రికార్డు క్రియేట్ చేసిన ఏకైక ఇండియన్ హీరో
Illu Illalu Pillalu Today Episode Dec 12: రాత్రయినా ఇంటికి రాని వల్లీ భర్త , వేదవతిని రెచ్చగొట్టిన నర్మద