NBK 107: క్రాక్ దర్శకుడితో బాలయ్య మొదలెట్టేశాడు!

By team telugu  |  First Published Nov 13, 2021, 12:53 PM IST


అఖండ విడుదలకు సిద్ధం అవుతుండగా, బాలయ్య మరో యాక్షన్ ఎంటర్టైనర్ కి శ్రీకారం చుట్టారు. తన 107 చిత్ర పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. 


అఖండ (Akhanda) చిత్రం సెట్స్ పై ఉండగానే బాలయ్య తన తదుపరి చిత్రం ప్రకటించారు. క్రాక్ సినిమాతో భారీ హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేనితో 107వ చిత్రం చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. క్రాక్ మూవీ టేకింగ్ చూసిన బాలయ్య, పిలిచి మరీ గోపీచంద్ కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టు, అవుట్ అండ్ అవుట్ మాస్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడు గోపీచంద్. 
ఇక తనకు కలిసొచ్చిన హీరోయిన్ శృతి హాసన్ ని దర్శకుడు గోపీచంద్ మరోమారు ఎంపిక చేశాడు. 

గతంలో గోపించంద్ (Gopichand malineni) దర్శకత్వంలో విడుదలైన హిట్ చిత్రాలు బలుపు, క్రాక్ లో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించారు. బాలయ్య మూవీ వీరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కాగా, మొదటిసారి బాలయ్యకు జంటగా శృతి కనిపించనున్నారు. కాగా నేడు ఈ చిత్ర లాంఛింగ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు నిర్మాతలు చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు. దర్శకుడు వివి వినాయక్ బాలయ్యపై క్లాప్ కొట్టగా,  బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. వీరితో పాటు దర్శకుడు బాబీ, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు, కొరటాల శివ ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. 

Latest Videos

Also read NBK 107: బాలయ్య-గోపీచంద్‌ మలినేని సినిమా ముహూర్తం ఫిక్స్..

శృతి హాసన్ (Shruti haasan) సైతం ఈవెంట్ లో పాల్గొనడం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక అనేక క్రేజీ టైటిల్స్ తెరపైకి వస్తుండగా, గోపీచంద్ ఎలాంటి మాస్ టైటిల్ ఎంచుకుంటారో చూడాలి. త్వరలోనే NBK 107 సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. మరోవైపు అఖండ మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి ముందే బాలయ్య బరిలో దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Also read బాలయ్య,అనీల్ రావిపూడి చిత్రం టైటిల్ తో పాటు మరో షాకింగ్ న్యూస్
 

click me!