ఆ మాట మిమ్మల్ని అంటే సైలెంట్ గా ఉంటారా..? రకుల్ ఫైర్!

Published : Jan 18, 2019, 02:29 PM IST
ఆ మాట మిమ్మల్ని అంటే సైలెంట్ గా ఉంటారా..? రకుల్ ఫైర్!

సారాంశం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కురచ దుస్తులు ధరించిందని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఆమెపై అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కురచ దుస్తులు ధరించిందని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఆమెపై అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. పొట్టి డ్రెస్ వేసుకొని కారు దిగుతున్న రకుల్ ఫోటోని పోస్ట్ చేసి.. కారులో సెషన్ పూర్తయిన తరువాత ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందంటూ అసభ్యంగా మాట్లాడాడు.

ఇది చూసిన రకుల్ సదరు నెటిజన్ కి ఘాటు సమాధానమిచ్చింది. మీ అమ్మ ఇలానే చేసి ఉంటుంది అందుకే నీ ఆలోచన అక్కడివరకే ఆగిపోయిందంటూ మండిపడింది. దీంతో సోషల్ మీడియాలో కొందరు రకుల్ కి సపోర్ట్ చేయగా.. మరికొందరు మాత్రం ఆమెను దూషిస్తూ కామెంట్స్ చేశారు.

నిన్ను అవమానించారని నువ్వు కూడా ఒక ఆడదాన్ని అవమానిస్తావా అంటూ రకుల్ ని విమర్శించారు. ఏమైనా ఉంటే కామెంట్ చేసిన వాడిని అనాలి కానీ అతడి తల్లి ఏం పాపం చేసిందని ప్రశ్నించారు. దీనికి రకుల్ 'అతడి కుటుంబంలో మహిళలను కించపరిస్తే బాధ ఎలా ఉంటుందో చెప్పడానికి అలా మాట్లాడానని' తనపై వస్తోన్న విమర్శలకు సమాధానమిచ్చింది.

తాజాగా రకుల్ మరో ట్వీట్ చేసింది. తనను ద్వేశించిన వారికోసం ఈ ట్వీట్ అంటూ సదరు నెటిజన్ చేసిన కామెంట్ బయటపెట్టింది. ''సదరు నెటిజన్ తన ట్వీట్ ని వెంటనే తొలగించాడు. ఇప్పుడు చెప్పండి.. ఇలాంటి మాటలపై మీరు కామ్ గా రియాక్ట్ అవుతారా..?'' అంటూ ప్రశ్నించింది. 

ప్యాంట్ వేసుకోలేదని రకుల్ పై వల్గర్ కామెంట్స్!

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు