మహేష్ 'మహర్షి'.. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇదే!

Published : Jan 18, 2019, 01:55 PM IST
మహేష్ 'మహర్షి'.. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇదే!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'మహర్షి'. ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహేష్ బాబు బిలియనీర్ గా కనిపించబోతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'మహర్షి'. ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహేష్ బాబు బిలియనీర్ గా కనిపించబోతున్నారు.

సంపన్నుడైన ఓ వ్యక్తి మహర్షిగా ఎలా మారుతాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిస్తే సెకండ్ హాఫ్ మాత్రం కాస్త సీరియస్ ఎమోషన్స్ తో సాగుతుందని తెలుస్తోంది. సినిమాకు ఇంటర్వెల్ బ్యాంగ్ కీలకంగా ఉంటుందని చెబుతున్నారు.

ఇంటర్వెల్ వచ్చే సమాయనికి హీరోలో వచ్చే మార్పు సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. తన కష్టం, శ్రమ పెద్ద స్థాయిలో ఉంచాయని నమ్మే హీరో తన ఎదుగుదలకు మరో బలమైన కారణం ఉందని, తన ఉన్నతికి సహాయపడిన ఓ స్నేహితుడు ప్రస్తుతం కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుంటాడు.

ఆ స్నేహితుడి కోసం మహేష్ పల్లెకి వెళతాడు. మహేష్ లో మార్పు రావడానికి ఓ బలమైన సంఘటన కారణమవుతుంది. అదే ఇంటర్వెల్ సీన్ అని తెలుస్తోంది. అక్కడ నుండి కథ మలుపు తీసుకొని మరింత ఎమోషనల్ గా సాగుతుందట. మహేష్  స్నేహితుడిగా హీరో నరేష్ నటిస్తున్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

Kangana Ranaut Sarees: పార్లమెంట్ ఫ్యాషన్ అదుర్స్.. కంగనా బెస్ట్ శారీ లుక్స్ చూశారా?
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?