లక్కు లేని పిల్లతో నాని!

By Prashanth MFirst Published Jan 18, 2019, 2:20 PM IST
Highlights

ఈ మధ్య కాలంలో ఎంట్రీ ఇస్తున్న బ్యూటీలు చాలా వరకు అవకాశాలు గట్టిగానే అందుకుంటున్న హిట్లు మాత్రం అందుకోవడం లేదు. 'లై' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మేఘ ఆకాష్ పరిస్థితి కూడా అలానే ఉంది. 

ఈ మధ్య కాలంలో ఎంట్రీ ఇస్తున్న బ్యూటీలు చాలా వరకు అవకాశాలు గట్టిగానే అందుకుంటున్న హిట్లు మాత్రం అందుకోవడం లేదు. 'లై' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మేఘ ఆకాష్ పరిస్థితి కూడా అలానే ఉంది. రెండవ సినిమా ఛల్ మోహన రంగ సినిమా కూడా అమ్మడికి కలిసి రాలేది. అయితే కోలీవుడ్ లో మాత్రం ఆఫర్స్ బాగానే అందుకుంటోంది. 

రిజల్ట్ తో సంబంధం లేకుండా ఛాన్సులు అందుకుంటున్న ఈ లక్కు లేని పిల్ల రీసెంట్ గా మరో తెలుగు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాని సినిమాలో మేఘ ఆకాష్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో సిద్దార్థ్ మొదటిసారి విలన్ గా కనిపించనున్నాడు. 

వరుసగా రెండు తెలుగు సినిమాలతో డిజాస్టర్ అందుకున్న మేఘ ఆకాష్ నానితో నటించే అవకాశం రావడం నిజంగా వెరీ లక్కీ అని చెప్పాలి. మరి ఈ అవకాశంతో టాలీవుడ్ బ్యూటీస్ కి ఎంతవరకు పోటీ ఇస్తుందో చూడాలి. కోలీవుడ్ లో శింబుతో అత్తారింటికి దారేది రీమేక్ తో పాటు మరో రెండు సినిమాలతో ఈ క్యూటీ గర్ల్ బిజీగా ఉంది.  

click me!