
విక్టరీ వెంకటేశ్ తాజా చిత్రం గురు షూటింగ్ పూర్తి చేసుకుంది. అవార్డ్ విన్నింగ్ తమిళ్ సూపర్ హిట్ ఫిల్మ్ ఇరుదు సుత్త్ రు చిత్రం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రమే విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ బాక్సింగ్ కోచ్ గా నటిస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. వచ్చేవారం డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రితికా సింగ్ మరియు ముంతాజ్ ఒరిజినల్ మూవీలో నటించిన పాత్రలనే ఈ చిత్రంలో కూడా పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి... ఈ చిత్రాన్ని జనవరి నెలాఖరున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.