రజనీకాంత్‌ ‘వేట్టయన్‌’హైదరాబాద్ లో జరిగిన ఆ సంఘటన బేస్ చేసుకునా?

By Surya Prakash  |  First Published Oct 3, 2024, 10:47 AM IST

 సోషల్ ఇష్యూలకు  ప్రాధాన్యతనిస్తూ ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. 'జైలర్' కథకు పూర్తి భిన్నంగా ఉంటుందని, రజనీ ఇమేజ్ కి దూరంగా అనిపిస్తుందని చెబుతున్నారు. 



రజనీకాంత్ సినిమాలకు ఓ సెపరేట్  ఫార్ములా ఉంటుంది. అదిరిపోయే హీరోయిజం ఉంటుంది. అయితే సామాజిక సందేశం ప్రధానాంశంగా తీసిన జై భీమ్ దర్శకుడు జ్వానవేల్ డైరక్షన్ అనగానే అభిమానులు అనుమాన పడ్డారు. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. సినిమా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో రెడీ అయ్యిందని ట్రైలర్ తో అర్దమైపోంది. ఈ క్రమంలో  రజనీకాంత్ అభిమానులంతా ఇప్పుడు 'వేట్టయన్' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏమై ఉండవచ్చు అనే విషయమై సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. 

ట్రైలర్ ను చూస్తే.. నేరస్తులు .. కోర్టులు .. పోలీసుల నేపథ్యంలో సాగే సన్నివేశాలను ట్రైలర్ లో ఎక్కువగా టచ్ చేశారు. ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించిన అమితాబ్ .. ఫహాద్ ఫాజిల్ .. రానా .. రావు రమేశ్ .. రితికా సింగ్ .. మంజు వారియర్ .. అభిరామి పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ వదిలారు. రజనీ మార్క్ డైలాగ్స్ తో .. ఫైట్లతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మరో ప్రక్క ఈ చిత్రం యథార్థ సంఘటన నేపథ్యంతో అల్లుకున్న కథ ఇది అనే టాక్ ఉంది. సోషల్ ఇష్యూలకు  ప్రాధాన్యతనిస్తూ ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. 'జైలర్' కథకు పూర్తి భిన్నంగా ఉంటుందని, రజనీ ఇమేజ్ కి దూరంగా అనిపిస్తుందని చెబుతున్నారు. దాంతో ఈ సినిమాపై సహజంగానే అంచనాలు పెరుగుతున్నాయి. 

Latest Videos

undefined

 

దిశ ఎనకౌంటర్ బేస్ గా ‘వేట్టైయాన్ - ది హంట‌ర్‌’

 

సోషల్ మీడియాలో ట్రైలర్ ని చూసి ..ఈ సినిమా హైదరాబాద్ లో జరిగిన దిశ ఎనకౌంటర్ చుట్టూ తిరుగుతుందని అంచనా వేస్తున్నారు. అప్పట్లో   2019 హైదరాబాద్ లో జరిగిన దిశా సంఘటన జరిగింది.  ఒక మెడికోని జాతీయ రహదారిపై అటకాయించి దారుణంగా అత్యాచారం చేయడమే కాక ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో అంతమొందించడం అప్పట్లో సెన్సేషన్  అయ్యింది. అయితే  రోజుల వ్యవధిలో నగర శివార్లలో నిందితులను పట్టుకుని ఎన్కౌంటర్ చేయడం గొప్ప సెన్సేషన్. ఈ ఆపరేషన్ ని లీడ్ చేసిన సజ్జనార్ జనం దృష్టిలో హీరో అయిపోయారు. ఆ తర్వాత మానవ హక్కుల విచారణ, ఇన్వెస్టిగేషన్ ఇదంతా వేరే కథ. వేట్టయన్ లో ఈ దారుణానికి సంబంధించిన పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు.

ఎడ్యుకేషన్ ఫ్రాడ్ మీదా ‘వేట్టైయాన్ - ది హంట‌ర్‌’ అసలు కథ?

 
అయితే ‘వేట్టైయాన్ - ది హంట‌ర్‌’చిత్రం అసలు కథ దిశ ఎనకౌంటర్ చుట్టూ కాదని తమిళ మీడియా వర్గాల కథనం. ఈ సినిమా అంతా  రీసెంట్ గా  ఎడ్యుకేషన్ సిస్టమ్ ని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వాలని మేనుప్యులేట్ చేసిన  ఫ్రాడ్  చేసిన ఓ వ్యక్తి చుట్టూ తిరుగుతుందని తమిళనాట టాక్ నడుస్తోంది. రానా ఓ పెద్ద ఎడ్యుకేషన్ యాప్ కంపెనీకి ఓనర్ గా కనిపిస్తాడని,అతను చేసే అక్రమాలకు రజనీ చెక్ పెడతాడని అంటున్నారు. అమితాబ్ క్యారక్టర్ ఇలాంటి ఎనకౌంటర్స్ కు వ్యతిరేకంగా వాదిస్తాడని తెలుస్తోంది.  సూర్యతో జై భీం లాంటి క్లాసిక్ మూవీ ఇచ్చిన టీజె జ్ఞానవేల్ దీనికి దర్శకుడు అవటం కలిసొచ్చే అంశం. అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ తో తమిళంలో ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. 


తెలుగులో  ‘వేట్టైయాన్ - ది హంట‌ర్‌’ పరిస్దితి ఏంటి

తెలుగులోనూ ఈ సినిమాకు  మెల్లగా బజ్ పెరుగుతోంది. బిజినెస్ బాగానే జరుగుతోంది. అయితే గతంలో రజనీ చిత్రాలుకు ఉన్నంత ఊపు అయితే లేదు అంటున్నారు. దానికి తగినట్లుగా  టైటిల్ మార్చకుండా యధాతథంగా తమిళ టైటిల్  ఉంచేయడం పట్ల బాషా ప్రేమికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.  ‘వేట్టైయాన్ - ది హంట‌ర్‌’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 10న భారీ ఎత్తున విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టి.జె.జ్ఞాన‌వేల్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు ‘2.0, ద‌ర్బార్‌, లాల్ స‌లామ్’ వంటి చిత్రాల త‌ర్వాత ర‌జినీకాంత్, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో రాబోతున్న నాలుగో సినిమా ‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’.
 

click me!