చిరంజీవి, బన్నీలో ఉండే ఒక్క కామన్ క్వాలిటీ వల్లే టాప్ హీరోలు అయ్యారు..స్వయంగా మెగాస్టార్ చెప్పిన నిజం

By tirumala ANFirst Published Oct 3, 2024, 9:24 AM IST
Highlights

45 ఏళ్ళు గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా వెలుగొందుతున్నారు చిరంజీవి. దశాబ్దాల పాటు టాలీవుడ్ లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. ఇప్పటికీ చిరంజీవి కుర్రాళ్లతో పోటీ పడుతూ నటిస్తున్నారు. సినిమాల విషయంలో చిరంజీవి అంచనా తప్పిన సందర్భాలు చాలా తక్కువ.

45 ఏళ్ళు గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా వెలుగొందుతున్నారు చిరంజీవి. దశాబ్దాల పాటు టాలీవుడ్ లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. ఇప్పటికీ చిరంజీవి కుర్రాళ్లతో పోటీ పడుతూ నటిస్తున్నారు. సినిమాల విషయంలో చిరంజీవి అంచనా తప్పిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన జడ్జిమెంట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకే మెగాస్టార్ అయ్యారు అంటూ చాలా మంది ప్రశంసిస్తుంటారు. 

ఒకప్పుడు మెగా, అల్లు రెండు కుటుంబాలు ఒక్కటే.. 

ఇప్పుడంటే మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య సఖ్యత లేదంటూ రూమర్స్ వస్తున్నాయి. కానీ ఒకప్పుడు మెగా ఫ్యామిలి వేరు, అల్లు ఫ్యామిలీ వేరు అన్నట్లునా పరిస్థితి ఉండేది కాదు. రెండు కుటుంబాలు ఒక్కటే. ఫ్యాన్స్ కూడా చిరంజీవి, అల్లు అరవింద్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అంతా ఒక ఫ్యామిలీనే అని భావించేవారు. ఒకరి సినిమా ఈవెంట్స్ కి మరొకరు హాజరయ్యే వారు. బహిరంగంగా ప్రేమాభిమానాలు చూపించుకునేవారు. 

Latest Videos

కానీ అలాంటి పరిస్థితి లేదని రూమర్స్ వస్తున్నాయి. దీనికి తోడు అల్లు అర్జున్ పొలిటికల్ గా సొంత నిర్ణయాలు తీసుకోవడం కూడా మెగా అభిమానులకు నచ్చడం లేదు. ఇదంతా పక్కన పెడితే పవన్ పాలిటిక్స్ లో బిజీ అయ్యారు. చిరంజీవి, రాంచరణ్, అల్లు అర్జున్ టాప్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇది వాస్తవం. డ్యాన్సులు అంటే చిరంజీవి గుర్తుకు వస్తారు. ఆ తర్వాత అల్లు అర్జున్, రాంచరణ్ కూడా డ్యాన్సులతో అదరగొడుతున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్ ఇద్దరిలో ఒక కామన్ క్వాలిటీ ఉందట. ఆ క్వాలిటీ వల్లే ఇద్దరూ టాప్ హీరోలు అయ్యారట. ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి. 

అల్లు అర్జున్, చిరంజీవి ఇద్దరిలో కామన్ క్వాలిటీ 

గతంలో ఓ సినిమా ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ఎప్పటికైనా మంచి హీరో అవుతాడని నాకు తెలుసు. అల్లు శిరీష్ ని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. శిరీష్ మహా మేధావి. ఏ రంగంలో అయినా రాణించగలడు. నటన కంటే వ్యాపారాల్లో బాగా రాణిస్తాడని అనుకునేవాడిని. వాళ్ళ తండ్రి అల్లు అరవింద్ తర్వాత గీతా ఆర్ట్స్ కి అధినేత అవుతాడని అనుకున్నా. కానీ శిరీష్ కూడా మా ట్రాప్ లో పడి నటుడు అయ్యాడు. 

బన్నీ విషయంలో మాత్రం నాకు క్లారిటీ ఉండేది. బన్నీ తప్పకుండా నటుడే అవుతాడు. ఎందుకంటే బన్నీ అంత తెలివైన వాడు కాదు. మా ఇద్దరిలో ఉండే క్వాలిటీ అదే. నేను కూడా తెలివైన వాడిని కాదు. నటన తప్ప ఇంకేమి తెలియదు. అలాంటి వాళ్లే టాప్ హీరోలు అవుతారు అని చిరంజీవి అన్నారు. చిన్నప్పుడు శిరీష్ బాగా బొద్దుగా ఉండేవాడు. అందరికంటే బాగా చదివేవాడు. కాబట్టి శిరీష్ నటుడు అవుతాడని ఎప్పుడూ ఊహించలేదని చిరు అన్నారు. గౌరవం చిత్రంతో అల్లు శిరీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే చిరంజీవి ఊహించినట్లు గానే శిరీష్ కెరీర్ ఆశాజనకంగా లేదు. శిరీష్ కి ఇంతవరకు సాలిడ్ హిట్ అంటూ లేదు. 

గంగోత్రి చిత్రంతో ఎంట్రీ, పాన్ ఇండియా స్టార్ గా బన్నీ 

గంగోత్రి చిత్రంతో హీరోగా పరిచయం అయిన బన్నీ.. ప్రతి చిత్రంలో తన మార్క్ ప్రదర్శిస్తూ టాప్ హీరోగా ఎదిగారు. పుష్ప చిత్రం అయితే అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. పుష్ప 2 డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. పుష్ప హిట్ కావడంతో పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ పుష్ప 2 గురించి అందుతున్న లీక్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. 

రాజకీయాల వల్ల అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య చీలిక ?

ఇటీవల అల్లు మెగా ఫ్యామిలీల మధ్య చీలిక వచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. రెండు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడడం లేదు కానీ ఫ్యాన్స్ లో మాత్రం ఈ వివాదం బహిరంగం అయిపోయింది. ఆ మధ్యన ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ వైసిపి అభ్యర్థికి మద్దతు తెలపడం.. జనసైనికులు, మెగా అభిమానులు, పవన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. అక్కడి నుంచి ఈ గొడవలు మరింత ఎక్కువయ్యాయి. పవన్ కళ్యాణ్ కి మాత్రం జస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపి సరిపెట్టుకున్నాడు. 

click me!