మీ హెడ్ లైన్స్ కోసం మమ్మల్ని వాడుకోవద్దు: నాగ చైతన్య

By Surya PrakashFirst Published Oct 3, 2024, 8:39 AM IST
Highlights

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదం. ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు. సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం దక్కాలి.

 తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపుతున్న సంగతి తెల ిసిందే. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను(KTR)  విమర్శిస్తూ సినీ పరిశ్రమ నటులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. సమంత(Samantha) , నాగచైతన్య (NagaChaitanya) కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారని మీడియాతో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో సినీ ప్రముఖులు అంతా స్పందిస్తున్నారు. అలాగే నటుడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) స్పందించారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆమోదనీయం కాదన్నారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు. 


మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారన్నారు. కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని సినిమా ఫీల్డ్‌ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్‌ అని ఆరోపించారు. నాగార్జున కుటుంబంలో చోటు చేసుకున్న పరిస్థితులకు కూడా కేటీఆర్‌ కారణమని ప్రస్తావించారు. దీంతో ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.  ఈ మాటలపై అక్కినేని కుటుంబంతో సమంత కూడా మండిపడ్డారు. అలాగే పలువురు సినీ నటీనటులు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. బాధ్యతగల పదవిలో ఉన్నప్పుడు కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి తీసుకురావడం కరెక్ట్ కాదని సినీ ప్రముఖులు చాలా మంది మండిపడుతున్నారు.


కొండా సురేఖ కామెంట్స్ పై నాగచైతన్య  స్పందిస్తూ..

Latest Videos

‘‘జీవితంలో విడాకుల నిర్ణయమనేది అత్యంత బాధాకరమైన, దురదృష్టకర విషయాల్లో ఒకటి. ఎన్నో ఆలోచనల తర్వాత పరస్పర అంగీకారంతోనే నా మాజీ భార్య, నేను విడిపోయాం. ఎంతో పరిణితితో ఆలోచించి మా విభిన్న లక్ష్యాల కోసం ముందుకు సాగడానికి విడాకులు తీసుకున్నాం. మా విడాకులపై గతంలో అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయి. ఇరు కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదం. ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు. సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం దక్కాలి. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల నిర్ణయాలను మీడియా హెడ్ లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు’’ అని నాగచైతన్య పేర్కొన్నారు. 

నాగార్జున ట్వీట్ ని రీట్వీట్ చేసిన నాగచైతన్య

మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలను నాగచైతన్య ఖండించారు. ఈ మేరకు తన తండ్రి నాగార్జున చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు. ‘‘గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’’అన్నారు. 

  కొండా సురేఖ (konda surekha) చేసిన వ్యాఖ్యలపై సమంత (Samantha) స్పందన

‘‘నా విడాకులు వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నా. మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారు.. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నా. దయచేసి చిన్న చూపు చూడకండి. ఓ మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను వేడుకుంటున్నా. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు సామ్‌.

 కొండా సురేఖ ఏమన్నారంటే..?

బీసీ మహిళనైన తనపై అసభ్యకర పోస్టులు పెట్టడం బాధాకరమని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలని కేటీఆరే ఆ పార్టీ కార్యకర్తలకు చెప్పినట్లు ఉందన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని అన్నారు. కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని సినిమా ఫీల్డ్‌ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్‌ అని ఆరోపించారు. అంతేకాదు, నాగార్జున కుటుంబంలో చోటు చేసుకున్న పరిస్థితులకు కూడా కేటీఆర్‌ కారణమని ప్రస్తావించారు.
 
 ఇప్పటికే  కొండా సురేఖ కామెంట్స్ ను ఇప్పటికే అటు అక్కినేని కుటుంబం, ఇటు సమంత ఖండించారు. తాజాగా మంత్రి వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమలోని నటీనటులు స్పందిస్తున్నారు. వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని ఎన్టీఆర్‌ (NTR) మండిపడ్డారు. ఆధారాల్లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు. కొండా సురేఖ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మరో నటుడు నాని (Nani) కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘శుద్ధి చెయ్యాల్సింది నదిని కాదు. వాళ్ళ బుద్ధిని. ఛీ!!! ఇంత నీచమా...’’ -సినీ రచయిత అబ్బూరి రవి అన్నారు.


కొండా సురేఖ కామెంట్స్ పై ఎన్టీఆర్ స్పందిస్తూ...


‘‘కొండా సురేఖగారు వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలి. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చొనేది లేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదు’’ అన్నారు.

click me!