Rajinikanth: తమిళనాడులో రజనీకాంత్, ఇండియాలో అక్షయ్ కుమార్.. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ గా అవార్డు

Published : Jul 25, 2022, 08:41 AM IST
Rajinikanth: తమిళనాడులో రజనీకాంత్, ఇండియాలో అక్షయ్ కుమార్.. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ గా అవార్డు

సారాంశం

తమిళనాడు నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ అత్యధిక ట్యాక్స్ చెల్లించిన వ్యక్తిగా నిలిచారు. దీనితో రజనీకాంత్ తరపున ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ అవార్డు అందుకున్నారు. 

జూలై 24న చెన్నైలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన వారిలో అత్యధిక ట్యాక్స్ చెల్లించిన వారికి ఐటి అధికారులు అవార్డులు అందించారు. 

తమిళనాడు నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ అత్యధిక ట్యాక్స్ చెల్లించిన వ్యక్తిగా నిలిచారు. దీనితో రజనీకాంత్ తరపున ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ అవార్డు అందుకున్నారు. సౌత్ లో సూపర్ స్టార్ రజనీ అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోల్లో ఒకరు. రజనీ క్రమం తప్పకుండా ట్యాక్స్ చెల్లిస్తారనే అంటుంటారు. 

రజనీకాంత్ తన చిత్రాలకు రూ 100 కోట్ల వరకు పారితోషికం అందుకుంటారనే టాక్ ఉంది. ఎంత డబ్బు ఉన్నా రజనీ హంగులు ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. మానసిక ప్రశాంతత కోసం రజనీ అప్పుడప్పుడూ హిమాలయాలకు వెళుతుండడం చూస్తూనే ఉన్నాం. ఇక తన తండ్రిని అవార్డుతో అభినందించిన ఐటీ అధికారులకు ఐశ్వర్య రజనీకాంత్ కృతజ్ఞతలు తెలిపింది. ఆయన కుమార్తెగా ఉన్నందుకు గర్వపడుతున్నట్లు ఐశ్వర్య పేర్కొంది. 

ఇక ఇండియా మొత్తంలో అత్యధిక ట్యాక్స్ చెల్లించిన నటుడిగా అక్షయ్ కుమార్ మరోసారి అవార్డు అందుకున్నారు. అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్ 80 నుంచి 100 కోట్ల వరకు ఉంటుందట. బాలీవుడ్ లో వేగంగా సినిమాలు చేసే హీరోల్లో అక్షయ్ కుమార్ ప్రధమ స్థానంలో ఉంటారు. ఏడాదికి అక్షయ్ నుంచి మూడు నాలుగు చిత్రాలు వచేస్తుంటాయి. 

అలాగే అక్షయ్ కుమార్ అనేక కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తుంటారు. పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంటారు. ఈ లెక్కన అక్షయ్ కుమార్ ఏడాది ఆదాయం వందల కోట్లల్లో ఉండడం సహజం. ఇక రజనీకాంత్, అక్షయ్ కుమార్ ఇద్దరూ 2.0 చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో అక్షయ్ కుమార్ పక్షి రాజాగా అలరించారు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు