
నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటిస్తున్న లేటెస్ట్ మూవీ `బింబిసార`(Bimbisara). ఫాంటసీ యాక్షన్ మూవీగా దర్శకుడు మల్లిడి వశిష్ట రూపొందించిన చిత్రమిది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ కే నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఫస్ట్ టైమ్ నటిస్తున్న ఫాంటసీ మూవీ ఇది. అదే సమయంలో కాస్ట్యూమ్ బేస్ట్ మూవీ కావడం విశేషం. విడుదలైన టీజర్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. నెవర్ బిఫోర్ అనేలా ఉన్నాయి.
కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కొత్త లుక్‌లో అదరగొట్టేలా ఉన్నారు. త్రిగర్తల రాజ్యానికి అధిపతి బింబిసారుడిగా ఆయన నట విశ్వరూపం చూపించారని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ నటించిన పాత్రలు ఓ ఎత్తు, ఈ సినిమా మరో ఎత్తు అనేలా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ మూవీ విడుదలకు సిద్దమవుతుంది. ఆగస్ట్ 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచారు. ఇప్పటికే రెండు పాటలు విడుదలై మరింతగా ఆకట్టుకున్నాయి. సినిమాకి హిట్ టాక్‌ని తీసుకొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో త్వరలోనే భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారట. ఈ నెల(జులై) 29న హైదరాబాద్‌లోని శిల్పాకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేశారట యూనిట్. అయితే ఈ ఈవెంట్‌కి ఎన్టీఆర్(NTR) గెస్ట్ గా రాబోతుండటం విశేషం. జనరల్‌గా కళ్యాణ్ రామ్ సినిమాలకు గెస్ట్ గా ఎన్టీఆర్ వస్తుంటారు. అయితే అవి భారీ చిత్రాలకు మాత్రమే. అదే సమయంలో సినిమాపై హైప్ పెంచేందుకు కూడా తారక్ రంగంలోకి దిగుతుంటాడు. అలా ఈ సారి కూడా తారక్ రాబోతున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ నటించిన చివరి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆయన వరుసగా భారీ చిత్రాలతో రాబోతున్నారు. అదే సమయంలో డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు. గత చిత్రాలు పరాజయంతో కాస్త లాస్‌లోకి వెళ్లిన కళ్యాణ్ రామ్ `బింబిసార`తో బ్లాక్ బస్టర్ కొట్టాలని, గత చిత్రాలతో నష్టాలను పూడ్చుకోవాలని భావిస్తున్నారు. ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కళ్యాణ్ రామ్ ఆశలకు తగ్గట్టుగానే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద గట్టిగానే హిట్ కొట్టేలా ఉందనిపిస్తుంది.