అద్భుతమైన దర్శకుడిని కోల్పోయాంః కె.వి ఆనంద్‌కి రజనీ, మహేష్‌, ధనుష్‌ సంతాపం

Published : Apr 30, 2021, 04:04 PM IST
అద్భుతమైన దర్శకుడిని కోల్పోయాంః  కె.వి ఆనంద్‌కి రజనీ, మహేష్‌, ధనుష్‌ సంతాపం

సారాంశం

ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ కె.వి ఆనంద్‌ కి సూపర్‌స్టార్ట్స్ రజనీకాంత్‌, మహేష్‌బాబు, ధనుష్‌ సంతాపం తెలిపారు. ఆయన మరణ వార్త మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా సంతాపం తెలియజేశారు. 

ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ కె.వి ఆనంద్‌ కి సూపర్‌స్టార్ట్స్ రజనీకాంత్‌, మహేష్‌బాబు, ధనుష్‌ సంతాపం తెలిపారు. ఆయన మరణ వార్త మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా సంతాపం తెలియజేశారు. తమిళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ కె.వి ఆనంద్‌ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు, సౌత్‌ ఇండస్ట్రీ మొత్తం షాక్‌కి గురయ్యింది. అద్భుతమైన, విలక్షణమైన సినిమాలను అందించిన దర్శకుడు ఇక లేరనే వార్తతో విచారం వ్యక్తం చేస్తున్నారు. 

రజనీకాంత్‌ స్పందిస్తూ, `గౌరవనీయమైన కె. వి ఆనంద్‌ మరణం దిగ్ర్భాంతికరమైనది. చాలా బాధాకరమైనది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి` అని తమిళంలో ట్వీట్‌ చేశారు.

మహేష్‌బాబు స్పందిస్తూ, `కె.వి ఆనంద్‌ మరణం నన్ను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. చిత్ర దర్శకుడిగా,  సినిమాటోగ్రాఫర్‌గా ఆయన ప్రతిభ అద్భుతం. వారి కుటుంబానికి,ప్రియమైన వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నా` అని ట్వీట్‌ చేశారు. 

`సున్నితమైన దయగల నిజాయితీ గల వ్యక్తి కన్నుమూశారు. జీవిత ప్రేమ, ఆనందంతో నిండిన చాలా మధురమైన మనిషి. కె.వి ఆనంద్‌ సర్ చాలా త్వరగా మమ్మల్ని విడిచివెళ్లిపోయారు సర్‌. ఆయన కుటుంబానికి నా సానుభూతి. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి` అని పేర్కొన్నారు హీరో ధనుష్‌.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్