'గూని వాడి' పాత్రలో రావు రమేష్

Surya Prakash   | Asianet News
Published : Apr 30, 2021, 03:36 PM IST
'గూని వాడి' పాత్రలో రావు రమేష్

సారాంశం

రావు రమేష్ వంటి నటన వచ్చిన నటుడు అయితే మరీ తపించిపోతాడు. అయితే ఆయనకు ఎప్పుడూ దాదాపు ఒకే రకం పాత్రలు వస్తున్నాయి. కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న డైలాగ్ డెలవరీతో లాగేసే పాత్రలు ఇస్తున్నారు. వాటిలోనే ఆయన వైవిధ్యం చూపే ప్రయత్నం చేస్తున్నారు. 

ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడూ ఏదో ఒక వైవిద్యం ఉన్న పాత్ర చేసి శభాష్ అనిపించుకోవాలనుకుంటాడు. అంతేకానీ ఎప్పుడూ ఒకే పాత్రలో ముందుకు వెళ్లాలనుకోడు. ముఖ్యంగా రావు రమేష్ వంటి నటన వచ్చిన నటుడు అయితే మరీ తపించిపోతాడు. అయితే ఆయనకు ఎప్పుడూ దాదాపు ఒకే రకం పాత్రలు వస్తున్నాయి. కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న డైలాగ్ డెలవరీతో లాగేసే పాత్రలు ఇస్తున్నారు. వాటిలోనే ఆయన వైవిధ్యం చూపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన్ని తాజాగా ఓ గూనివాడు పాత్ర వెతుక్కుంటూ వచ్చిందని సమాచారం. 

ఆర్ఎక్స్ 100 సినిమా తరువాత దర్శకుడు అజయ్ భూపతి డైరక్ట్ చేస్తున్న మహా సముద్రంలో ఈ క్యారెక్టర్ వుంటుంది. శర్వానంద్, సిద్దార్ధ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్ పాత్ర కూడా కీలకంగా వుంటుందట.రీసెంట్ గా అల వైకుంఠపురములో సినిమాలో మురళీశర్మ కాలు అవిటిగా వుండే పాత్ర చేసి శభాష్ అనిపించుకున్నారు. అలాగే రంగస్దలంలో రామ్ చరణ్ చెవిటివాడుగా, నత్తి ఉన్న పాత్రలో జై లవకుశలో ఎన్టీఆర్ మెప్పించారు. ఈ నేపధ్యంలో గూని వాడిగా రావు రమేష్ ఎలా మెప్పిస్తారో అనేది ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే అంశం.   

 శర్వానంద్ - సిద్ధార్థ్ హీరోలుగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్. ప్రేమతో కూడిన యాక్షన్‌ డ్రామా కథగా సినిమా తెరకెక్కుతోంది.  జగపతిబాబు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఆగస్టు 19న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

PREV
click me!

Recommended Stories

Mohan Babu చిరంజీవి అన్నదమ్ములుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Suma Rajeev Divorce: తల్లిదండ్రుల విడాకుల విషయంలో అసలు జరిగింది ఇదే.. చెప్పేసిన సుమ కొడుకు రోషన్