శర్వానంద్‌ 'శ్రీకారం'.. అక్కడ బీభత్సం..!

By Surya PrakashFirst Published Apr 30, 2021, 1:51 PM IST
Highlights

 రైతు మాత్రం త‌న కొడుకు రైతు కావాల‌నుకోడు. త‌రాలుగా సాగుతున్న వ్య‌వ‌సాయం పరిస్థితి నేడు అలా మారిపోయింది. వ్య‌వ‌సాయం కొత్త  పుంత‌లు తొక్కాల‌ని చెబుతూ రూపొందిన చిత్ర‌మే.. ‘శ్రీకారం’. 

 హిట్టుకోసం తహతహలాడుతున్న హీరోలలో ఒకరు శర్వానంద్. 2017లో శతమానం భవతి, మహానుభావుడు తర్వాత మళ్లీ అలాంటి హిట్ ఈ హీరో ఖాతాలో పడలేదు. పడిపడిలేచే మనసు చాలా ఎక్సపెక్టేషన్స్ తో రిలీజై డిజాస్టర్ అయ్యింది. సేమ్ టు సేమ్ రణరంగం, జానూ సినిమాలు.  రణరంగం, జానూ సినిమాలు వచ్చాక పడిపడిలేచే మనసు బెస్ట్ అన్నారు. ఆ తర్వాత మళ్లీ శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వానంద్. కానీ ఆ సినిమా కూడా వర్కవుట్ కాలేదు. సోసో సినిమా అనిపించుకుంది. మొదటి నుంచి శర్వానంద్...ఎందుకో ఈ సినిమాపట్ల అంత ఉత్సాహంగా లేడని వార్తలు వినిపించాయి. ఆ టాక్ కు  తగ్గట్లుగానే సినిమా నీరసంగా థియోటర్స్ నుంచి వెనుతిరిగింది.  అయితే ఈ మధ్యే సన్ ఎన్ఎక్స్టీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో ఈ సినిమా  స్ట్రీమింగ్ అయ్యింది. విచిత్రంగా ఈ సినిమా ఓటీటీలో రికార్డ్స్ క్రియేట్ చేస్తోందని సమాచారం.

సన్ ఎన్ఎక్స్ టి లో తక్కువ సమయంలో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా శర్వా 'శ్రీకారం' నిలిచింది. ఓటీటీలో ఐదు వేర్వేరు భాషల కంటెంట్ కావల్సినంత అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిలో 'శ్రీకారం' సినిమా మిలియన్ల వ్యూస్ సంపాదించి మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సూపర్ హిట్ గా నిలవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.  వ్యవసాయం ప్రాధాన్యతను తెలియజేస్తున్న సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. న కొత్త దర్శకుడు బి. కిషోర్ రెడ్డి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

'శ్రీకారం' చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట - గోపీ ఆచంట కలసి నిర్మించారు. ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ ఇందులో హీరోయిన్ గా నటించింది. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చగా.. జె యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు. రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాసారు. సీనియర్ నరేష్ - సాయికుమార్ - మురళీ శర్మ - రావు రమేష్ - ఆమని - సత్య - సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 

click me!