రజినీకాంత్ మేనియా.. 'పేటా' థియేటర్ బయట పెళ్లి!

Published : Jan 10, 2019, 04:06 PM IST
రజినీకాంత్ మేనియా.. 'పేటా' థియేటర్ బయట పెళ్లి!

సారాంశం

దక్షిణాది అగ్రహీరో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది అభిమానులు ఆయన్ని దైవంగా భావిస్తుంటారు. 

దక్షిణాది అగ్రహీరో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది అభిమానులు ఆయన్ని దైవంగా భావిస్తుంటారు. రజినీకాంత్ సినిమా విడుదలవుతుందంటే అభిమానులుచేసే హంగామా మాములుగా ఉండదు.

ఇది ఇలా ఉండగా.. రజినీకాంత్ మీద ఉన్న అభిమానాన్ని వినూత్నంగా తెలిపింది ఓ జంట. గురువారం 'పేటా' సినిమా రిలీజ్ సందర్భంగా అంబసు, కమాచి అనే యువతీయువకులు థియేటర్ బయటే పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

పేటా సినిమా రిలీజ్ ముహూర్తాన్నే మంచి ముహూర్తంగా భావించి ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది. ఉడ్లాండ్స్ థియేటర్ బయట వివాహ వేదికను ఏర్పాటు చేసుకొని.. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. 

థియేటర్ బయటే పెళ్లి చేసుకోవడంతో రజినీకాంత్ సినిమా చూడడానికి వచ్చిన అభిమానులంతా ఈ పెళ్లి వేడుక చూసి నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు.   

 

పాత ఊట...(రజనీ 'పేట' రివ్యూ)

ప్రీమియర్ షో టాక్: పేట

'పేటా' ట్విట్టర్ రివ్యూ!

 

 

PREV
click me!

Recommended Stories

Poonam Kaur: తనకి ఎలాంటి భర్త కావాలో అప్పుడే చెప్పిన పూనమ్ కౌర్.. అలాంటి వ్యక్తి ఇంకో పీస్ ఉండరు
వెయిటింగ్ లిస్ట్‌లో జన నాయగన్.. దళపతి విజయ్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు?