`కూలీ`గా రజనీకాంత్‌-లోకేష్‌ కనగరాజ్‌ మూవీ.. అదిరిపోయిన టైటిల్ టీజర్‌.. ఈ సారి గోల్డ్ స్మగ్లింగ్‌పై యుద్ధం..

Published : Apr 22, 2024, 06:41 PM IST
`కూలీ`గా రజనీకాంత్‌-లోకేష్‌ కనగరాజ్‌ మూవీ.. అదిరిపోయిన టైటిల్ టీజర్‌.. ఈ  సారి గోల్డ్ స్మగ్లింగ్‌పై యుద్ధం..

సారాంశం

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ని విడుదల చేశారు. టైటిల్‌ ని ప్రకటిస్తూ అదిరిపోయే టీజర్‌ని వదిలారు.


సినిమాటిక్‌ యూనివర్స్ ని క్రియేట్‌ చేసిన దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌. `ఖైదీ`తో ఆయన ఈ సిరీస్‌ని ప్రారంభించారు. `విక్రమ్‌`తో దాన్ని పీక్‌కి తీసుకెళ్లాడు. ఇటీవల విజయ్‌తో చేసిన `లియో`తో నిరాశ పరిచినా ఇప్పుడు ఏకంగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో వస్తున్నాడు. తన సినిమాటిక్‌ యూనివర్స్ లో రజనీని దించాడు. ఆయనతో `తలైవా 171` మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్‌‌ని ప్రకటించారు. ఈ మేరకు తన మార్క్ ఇంట్రడక్షన్‌ టీజర్‌ని విడుదల చేశారు. 

ఇందులో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుంటారు. ఆ మాఫియా అంతం చేయడానికి వస్తాడు రజనీకాంత్‌. గోల్డ్ గోదాములో ప్రత్యర్థుల అంతు చూస్తాడు. గోల్డ్ వాచ్‌లతో వాళ్లని చితక్కొడతాడు. ఇక చివర్లో ఆయన ఇచ్చే స్మైల్‌ అదిరిపోయేలా ఉంది. డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. చాలా పవర్‌ ఫుల్‌గా ఉన్నాయి. చివరగా ఈ మూవీ టైటిల్‌ని ప్రకటించారు. రజనీ చేతికి కూలీ బిల్లా ఉంటుంది. ఇందులో ఆయన కూలీగా కనిపించబోతున్నారు. సినిమా పేరు కూడా `కూలీ` కావడం విశేషం. అయితే కూలీతో వచ్చిన సినిమాలు పెద్ద బ్లాక్‌ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు రజనీ మరో హిట్‌కి రెడీ అవుతున్నారని చెప్పొచ్చు.

లోకేష్‌ కనగరాజ్‌ ఇప్పటి వరకు డ్రగ్స్ పై పోరాటం చేశారు. ఈ సినిమాలో గోల్డ్ స్మగ్లింగ్‌పై ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తుంది. వీటన్నింటికి ముడిపెడుతూ తన లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్ ని క్రియేట్‌ చేస్తున్నారు. సన్‌ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో శృతి హాసన్‌ కీలక పాత్రలో కనిపిస్తుందని, నాగార్జున ముఖ్య పాత్రలో నటిస్తారని, ఓ మల్టీస్టారర్‌గా దీన్ని లోకేష్‌ తెరకెక్కిస్తున్నారని సమాచారం. పాన్‌ ఇండియా మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు. 
 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?
Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?