#F3 :స్టేజిపై రాజేంద్రప్రసాద్ ఇలా శపధం చేసాడేంటి ?

Surya Prakash   | Asianet News
Published : May 22, 2022, 10:53 AM ISTUpdated : May 22, 2022, 11:32 AM IST
#F3 :స్టేజిపై రాజేంద్రప్రసాద్ ఇలా శపధం చేసాడేంటి ?

సారాంశం

 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 27న విడుదలకానుంది.  ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ పెంచారు.  ఈ చిత్రం ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఏకంగా ఒక   శపధం చేశారు. 


ఫన్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో  వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది.  చాలా కాలం తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. అలాగే వరుణ్ తేజ్ కెరీర్‌లో కూడా ఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇక ఆ సినిమాకు ఎఫ్ 3 అంటూ సీక్వెల్ రెడీ అయిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. 

వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు అనిల్ రావిపూడి. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 27న విడుదలకానుంది.  ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ పెంచారు.  ఈ చిత్రం ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఏకంగా ఒక   శపధం చేశారు. ఎఫ్ 3 హిట్ కాకపొతే మళ్ళీ ప్రేక్షకుల ముందు నిలబడనని ప్రకటించారు.

 ”నేటి పరిస్థితి వందశాతం అవసరమైన సినిమా ఎఫ్ 3. దీనికి కారణం నవ్వు. ఒక మనిషి జీవితంలో నవ్వుకి ఎంత ప్రాధాన్యత వుందో చెప్పే సినిమా ఎఫ్ 3. సమాజంలో ఎన్ని సమస్యలు అన్నిటికి పరిష్కారం నవ్వు. నలఫై ఏళ్ళుగా నేను నమ్మింది ఇదే. ఎఫ్ 3 లో పాత్రలన్నీ నవ్వులు పంచుతాయి. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు అనిల్ రావిపూడికి దక్కుతుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది, ఈ సినిమా హిట్ కాకపొతే మళ్ళీ మీ ముందు ఎప్పుడూ నిలబడను” అని ఏకంగా ఒక శపధం లాంటి స్టేట్మెంట్ ఇచ్చిన  రాజేంద్రప్రసాద్ హాట్ టాపిక్ గా మారారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా