Rajamouli :ఎన్టీఆర్‌ని రాజమౌళి ఎందుకు విష్ చేయలేదు? అసలు ఏం జరిగింది

By Surya Prakash  |  First Published May 22, 2022, 10:38 AM IST

 మే 20 న పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా  చెప్పలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వచ్చాయి. RRR విడుదల తర్వాత  చరణ్ కు ఈ సినిమాతో మంచి క్రేజ్ వచ్చిందని... ఆ టాక్‌తో నందమూరి హీరో కలత చెందాడని అంటున్నారు.


సోషల్ మీడియాలో ప్రతీ విషయం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సెలబ్రెటీల విషయాలు హాట్ టాపిక్ గా లుగా చర్చించుకుంటున్నారు.  రెండు రోజుల నుంచి ఓ టాపిక్ అయితే మరీ ఎక్కువగా డిస్కస్ జరుగుతోంది.అదే రాజమౌళి...ఎన్టీఆర్ కు విషెష్ చెప్పలేదని.  

వాస్తవానికి  ఎస్ఎస్ రాజమౌళి మరియు జూనియర్ ఎన్టీఆర్ అత్యంత సన్నిహిత మిత్రులు. తమ కెరీర్ ప్రారంభం నుండి చాలా సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే  మే 20 న పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా  చెప్పలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వచ్చాయి. RRR విడుదల తర్వాత  చరణ్ కు ఈ సినిమాతో మంచి క్రేజ్ వచ్చిందని... ఆ టాక్‌తో నందమూరి హీరో కలత చెందాడని అంటున్నారు. దాంతో తారక్ మరియు రాజమౌళి మధ్య చెడిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. దానికి ఇప్పుడు ఇలా విషెష్ చెప్పకపోవటం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. 

Latest Videos

అయితే వాస్తవానికి అలాంటి విభేధాలు ఏమీ లేవని తెలుస్తోంది. రాజమౌళి, ఎన్టీఆర్ చాలా మంచి స్నేహితులు. ఇలాంటి  అర్థం లేని గొడవలకు దిగరు. ఆ స్దాయి మెచ్యూరిటి ఉన్నవాళ్లు.   వారు ఒకరికొకరు ఎవరేంటో తెలుసు. అంతేకాకుండా రాజమౌళి పర్శనల్ గా ఆయనకు పుట్టిన రోజు విషెష్ చెప్పారట. కేవలం  సోషల్ మీడియాలో విష్ చేయనందున, ఇలాంటి విచిత్రమైన వార్తలు పుట్టించటం. ఇద్దరికి చెడిందని ప్రచారం  చేయడం అర్థరహితం.

click me!