Radhe Shyam: సినిమా రిజల్ట్ పై జ్యోతిష్కుడు ముందే అదే చెప్పాడా!షాకింగ్ టాక్

By Surya Prakash  |  First Published Dec 26, 2021, 8:29 AM IST


గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్. 70ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథతో రూపొందుతోంది. 


 ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించారు. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద నిర్మిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్‌ పతాకంపై కృష్ణంరాజు సమర్పిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందింది. ఈ సందర్భంగా చిత్ర  టెక్నికల్ టీమ్ హైదరాబాద్‌లో మీడియాతో సమావేశమైంది. అందులో భాగంగా ఓ చిత్రమైన విషయాన్ని రివీల్ చేసారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌. ‘రాధేశ్యామ్‌’ 2022లోనే అని నాలుగేళ్ల కిందే చెప్పారు అని అన్నారు. 

దర్శకుడు మాట్లాడుతూ... “నాలుగేళ్ల క్రితం  ‘రాధేశ్యామ్‌’ ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ఆ క్రమంలో ఈ సినిమా కథ కోసం  తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పెద్ద జ్యోతిష్యుల్ని కలిశాం. వాళ్లలో ఒకరు ముందే చెప్పారు... ఈ చిత్రం 2022 ప్రథమార్థంలో విడుదలయ్యే అవకాశముందని... అదే జరుగుతోంది ఇప్పుడు. అయితే నేను మొదట నమ్మలేదు. కానీ నిజమైంది.” అన్నారు.

Latest Videos

అదే సమయంలో ఈ సినిమా సక్సెస్ గురించి కూడా ఆ జ్యోతిష్యుడు ఏదో చెప్పే ఉంటాడని అభిమానులు అంటున్నారు. సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పబట్టే..అంత ఖర్చు పెట్టి ఉంటారని, ఈ విషయం కూడా నిజం అవుతుందని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

అలాగే ‘‘ప్రభాస్‌ ఇమేజ్‌ విషయంలో అభిమానుల అంచనాలకు మించి ఉంటుందీ చిత్రం. పద్దెనిమిదేళ్ల కిందట విన్న ఈ కథాలోచన నాలో స్ఫూర్తిని రగిలించింది. వేల ఏళ్లుగా ఉన్న ఓ ప్రశ్న. అయితే దానికి సమాధానం చెబుతున్నానని కాదు కానీ, దానికి నా వివరణ  ఏమిటన్నది తెరపైనే చూడాలి. ఈ కథ ఈ స్థాయికి రావడానికి నా గురువు చంద్రశేఖర్‌ ఏలేటి, హీరోప్రభాస్‌లే కారణం. నిర్మాతలు వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ ఈ రోజు వరకూ ఏది కావాలంటే అది ఇచ్చారు.    ట్రైలర్‌ చూసినవాళ్లంతా విజువల్‌ ఎఫెక్ట్స్‌ చాలా బాగున్నాయని చెబుతున్నారు. కమల్‌కన్నన్‌, ఆయన టీమ్ కే ఈ క్రెడిట్‌ దక్కుతుంది. 12 దేశాల్లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ పని జరుగుతోంది’’ అని చెప్పుకొచ్చారు.

ఇక ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్, పోస్టర్ లలో ప్రభాస్‌ లుక్‌, డైలాగ్‌లు, హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. జస్టిన్‌ ప్రభాకరణ్‌ అందించిన సంగీతం హత్తుకునేలా ఉంది. ‘బాహుబలి’, ‘సాహో’ వంటి యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు.  

గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్. 70ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథతో రూపొందుతోంది.  ఇది కాలం, జాతకాలతో ముడిపడి ఉన్న ప్రేమ  కథని తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

click me!