డేవిడ్ వార్నర్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. అనుచిత వ్యాఖ్యలు చేశారంటు వస్తున్న ట్రోలింగ్ కు ఆయన సమాధానం చెప్పారు. ఇంతకీ రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే?
Rajendra Prasad Responds to David Warner Controversy: ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై చేసిన వ్యాఖ్యల విషయంలో స్పందించారు ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్. అందరు అనుకున్నట్టు వేరే ఉద్దేశ్యం తనకు లేదని ఆయన అన్నారు. అంతే కాదు తాను వార్నర్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యామన్నారు. ఆ చనువుతో కాస్త అటు ఇటుగా మాట్లాడాను తప్పించి.. తనకు వేరే ఆలోచన లేదున్నారు. కావాలని తనను అవమానించలేదని క్లారిటీ ఇస్తూ.. రాజేంద్ర ప్రసాద్ ఓ వీడియో రిలీజ్ చేశారు.
డేవిడ్ వార్నర్ తాను చాలా క్లోజ్ అన్నారు రాజేంద్ర ప్రసాద్. రాబిన్ హుడ్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో తాను చేసిన వ్యాఖ్యలు కావాలని చేసినవి కాదన్నారు. ఈవెంట్ కు ముందు వరకూ కూడా తామంతాకలిసి సరదాగా గడిపామని, జోకులు వేసుకుంటూ నవ్వుకున్నామన్నారు. నువ్వు క్రికెట్ నుంచి సినిమాల్లోకి వస్తున్నావు కదా.. నీ సంగతి చూస్తా అని నేనుఅంటే.. నువ్వు సినిమాల్లోంచి క్రికెట్ లోకి రా, నేను కూడా నీ సంగతి చూస్తా అంటూ అతను అన్నాడు. ఇలా ఇద్దరం సరదాగా అనుకుని నవ్వుకున్నాము అని అన్నారు రాజేంద్ర ప్రసాద్. నాతో అంత క్లోజ్ అయ్యాడు కాబట్టి చనువుగా మాట్లాడాను కాని.. అతనిపై తనకు వేరే ఉద్దేశ్యం లేదున్నారు రాజేంద్ర ప్రసాద్. కావాలని అనలేదు. అయినా సరే ఈ విషయంలో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. అంతే కాదు ఈ 28న రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడాలంటూ రాజేంద్ర ప్రసాద్ కోరారు.
Also Read: 12 మంది హీరోలు రిజెక్ట్ చేసిన కథతో, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
రీసెంట్ గా జరిగిన రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో రెచ్చిపోయి మాట్లాడారు రాజేంద్ర ప్రసాద్. సరదాగా కామెడీ చేస్తూ.. అందరిగురించి మాట్లాడుతూ.. డేవిడ్ వార్నర్ గురించి కాస్త నోరు జారి మాట్లాడారు. ఆయన్ను ఏదో సరదాగా ఆటపట్టించాలని చూసిన స్టార్ యాక్టర్ .. నోరు జారి ఓ మాట అనేశారు. దాంతో ఈ విషయం పెద్ద దుమారం రేపింది. డేవిడి వార్నర్ ఫ్యాన్స్ రాజేంద్ర ప్రసాద్ పై మండిపడ్డారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగిపోయింది. ఎవరికి నచ్చింది వారు రాసేసుకుంటున్నారు. రాజేంద్ర ప్రసాద్ వార్నర్ ను బూతులు తిట్టాడంటూ ఫైర్ అయ్యారు. దాంతో సినిమాపై కూడా ఈ ప్రభావం పడుతుందని అంతా భయపడ్డారు. అయితే ఈ విషయం పెద్దది అవుతుండటంతో రాజేంద్ ప్రసాద్ స్పందించి సారి చెప్పారు. దాంతో డేవిడ్ ఫ్యాన్స్ కూల్ అయ్యారు.
Also Read: రెండో బిడ్డకు జన్మనిచ్చిన రామ్ చరణ్ హీరోయిన్, ఏం పేరు పెట్టిందో తెలుసా?
రాబిన్ హుడ్ సినిమాతో ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించపోతున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్నర్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లీగుల్లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే చిత్రం ఏంటంటే.. ఈసారి ఐపీఎల్ 2025 సీజన్‌లో వార్నర్ ను ఏ ఫ్రాంఛైజీ కొనలేదు. దాంతో ఆయన ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. ఈసారి ను ఐపీఎల్ 2025 సీజన్‌లో వార్నర్ కనిపించడని తెలిసి ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. అయితే ఆయన ఆడియన్స్ కు మరింత చేరువయ్యేందుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అదికూడా తనకు ఎంతో ఇస్టమైన టాలీవుడ్ నుంచి ఎంట్రీ ఇస్తున్నారు. నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ చిత్రం ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు వార్నర్.
Also Read: జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్ మూవీ, ముహూర్తం ఎప్పుడంటే?
నితిన్, శ్రీలీల జంటగా నటించిన మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న నితిన్.. ఈసినిమాతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. ఇక ఈమూవీ మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమాలో వార్నర్ నటిస్తుండటంతో ఈసినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమా ప్రియులతో పాటు క్రికెట్ అభిమానులు నుంచి కూడా రాబిన్ హుడ్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందన్ననమ్మకంతో ఉన్నారు. మరి వారి అంచనాలు ఎంత వరకూ నిజం అవుతాయో చూడాలి.
Also Read: కోటా శ్రీనివాసరావు పర్ఫామెన్స్ తో పిచ్చెక్కించిన సినిమా? ఓవర్ నైట్ స్టార్ ను చేసిన మూవీ ఏదో తెలుసా?