రాజశేఖర్ ఫ్యామిలీని వెంటాడుతున్న శనీశ్వరుడు.. మరో వివాదం

Published : Nov 06, 2017, 01:06 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
రాజశేఖర్ ఫ్యామిలీని వెంటాడుతున్న శనీశ్వరుడు.. మరో వివాదం

సారాంశం

రాజశేఖర్ కుటుంబంలో మరో విషాదం రాజశేఖర్ కూతురు శివానీపై కేసు నమోదు లగ్జరీ కారును ఢీకొట్టి కేసులో ఇరుక్కున్న శివాని

హీరో రాజశేఖర్ నటించిన ‘గరుడ వేగ’ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు పాజిటివ్ గా వున్నాయి.. అందుకు తగ్గట్టుగానే సినిమా విజయం సాధించింది.  సినిమా విజయం ఆనందాన్నిస్తున్నా.. ఈ మద్య రాజశేఖర్ కుటుంబంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  ఇటీవల ఆయన తల్లి మరణించారు..ఆ బాధలో నిద్రమాత్రలు మింగి యాక్సిడెంట్ కూడా చేసిన విషయం మనకు తెలిసిందే. ఇంతలోనే గరుడవేగ చిత్రం రిలీజ్ కి ముందు ఆయన బావమరిది చనిపోయారు. 

 

ఇంతలో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీపై కేసు నమోదైంది.  శివాని స్పీడ్ బ్రేకర్ను దాటే క్రమంలో కారుని అదుపు చేసుకోలేక యాక్సిడెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. శివాని నడుపుతున్న ఏపీ 13ఈ 1234 నంబర్ కారు జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.73 నవనిర్మాణనగర్‌ మలుపు వద్ద అదుపు తప్పి ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. 

 

సదరు పారిశ్రామికవేత్త తాను రెండు వారాల కిందటే రూ. 30 లక్షలు వెచ్చించి ఆ కారును కొన్నానని చెబుతున్నారు. తనకు నష్టపరిహారంగా రూ. 30 లక్షలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 

రాజశేఖర్ ప్రస్తుతం గరుడ వేగ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుండగా, ఇలాంటి టైంలో మరో వివాదం ఆయన మెడకి చుట్టుకోవడం కుటుంబ సభ్యులని బాధిస్తుంది. రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ప్రస్తుతం మెడిసన్ చేస్తుండగా, త్వరలో వెండితెర ఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్దమవుతుంది.

PREV
click me!

Recommended Stories

850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం
1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు