చిరుతో విబేధాలా.. మాకా.. ఏం అడుగుతున్నారు-జీవిత

Published : Nov 05, 2017, 07:33 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
చిరుతో విబేధాలా.. మాకా.. ఏం అడుగుతున్నారు-జీవిత

సారాంశం

గతంలో చిరంజీవితో జీవిత రాజశేఖర్ దంపతుల విబేధాలు చిరును విమర్శించడానికి ఏ అవకాశాన్ని కూడా వదలని జీవిత రాజశేఖర్ గరుడ వేగ రిలీజ్ సందర్భంగా చిరుతో దోస్తీ, మాకు విబేధాలేంటి అంటున్న జీవిత

దాదాపు దశాబ్దం క్రితం మెగాస్టార్ చిరంజీవి,  జీవిత రాజశేఖర్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న సంగతి దేశమంతా చూసింది. కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి, యాంగ్రీ యంగ్‌మేన్ రాజశేఖర్‌కి పడటం లేదనేది పాత మాట. చిరంజీవిని విమర్శించే ఏ ఒక్క అవకాశాన్ని రాజశేఖర్, జీవితలు వదులుకోలేదనేది గతమేనట. కానీ ప్రస్తుతానికి తమ మధ్య ఏ విభేదాలు లేవంటున్నారు జీవిత రాజశేఖర్.

 

తన లేటెస్ట్ మూవీ గరుడ వేగ సినిమా ప్రీమియర్ షోకి మెగాస్టార్‌ని ఆహ్వానించడానికి అతడి ఇంటికి వెళ్లిన రాజశేఖర్, జీవిత దంపతులకి మెగా ఫ్యామిలి నుంచి సాదర స్వాగతం లభించింది. జీవిత రాజశేఖర్ దంపతులు చిరంజీవి ఇంటికి వెళ్లారట అనేది ఆ తర్వాతి రోజు న్యూస్ హెడ్‌లైన్స్‌లోకి ఎక్కింది. కానీ దురదృష్టవశాత్తుగా జీవిత సోదరుడు మురళి మృతిచెందడంతో ఆ ప్రీమియర్ షో క్యాన్సిల్ అయింది.

 

ప్రీమియర్ షో క్యాన్సిల్ అయినప్పటికీ.. చిరు-రాజశేఖర్ ఒక్కటయ్యారనే వార్త మాత్రం అందరినీ అమితంగా ఆకర్షించింది. ఇదే విషయంపై స్పందించిన జీవిత రాజశేఖర్.. చిరుతో తమకెప్పుడూ ఏ రకమైన విభేదాలు లేవని అన్నారు. గరుడ వేగ ప్రమోషన్స్‌లో పాల్గొన్న జీవిత ఈ విషయంపై మాట్లాడుతూ.. తాము చిరంజీవిని కలిసిన ప్రతీసారి ఏదో వింత జరిగినట్టుగా చూస్తారు కానీ తాము తరచుగా సినిమా వేడుకలు, సినీ ప్రముఖుల ఫంక్షన్స్‌లో కలుస్తూనే వుంటామని అన్నారామె. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి