వర్ణించేందుకు మాటలు చాలవు తారక్, గర్వంగా వుంది జైజై.. జైలవకుశ: రాజమౌళి

Published : Sep 22, 2017, 05:25 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
వర్ణించేందుకు మాటలు చాలవు తారక్, గర్వంగా వుంది జైజై.. జైలవకుశ: రాజమౌళి

సారాంశం

గురువారం రిలీజై బాక్సాఫీస్ సునామీ సృష్టిస్తున్న ఎన్టీఆర్ జై లవకుశ జైలవకుశ సినిమాకు టాలీవుడ్ ప్రముఖల నుంచి కూడా ప్రశంసలు జైలవకుశ చూసి ఎన్టీఆర్ గురించి పొగిడేందుకు మాటలు లేవన్న రాజమౌళి

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవ కుశ’ సినిమా ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ‘జై లవ కుశ’ బాక్సాఫీసును కొల్లగొట్టడం ఖాయమని సర్వత్రా టాక్ వినిపిస్తోంది. మరోవైపు సెలబ్రిటీల నుంచి కూడా ‘జై లవ కుశ’కు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎన్టీఆర్ సినిమా విడుదలైందంటే ఎస్.ఎస్.రాజమౌళి ఫస్ట్‌ డే ఫస్ట్ షో చూడాల్సిందే. ఎన్టీఆర్ అంటే అంత లవ్ జక్కన్నకు. గురువారం విడుదలైన ‘జై లవ కుశ’ సినిమాను చూసిన రాజమౌళి వెంటనే ట్విట్టర్‌లో స్పందించారు. ఒకే ఒక్క వాక్యంతో సినిమాను, ఎన్టీఆర్ గొప్పతనాన్ని పొగిడేశారు. ‘తారక్‌.. గర్వంతో నా హృదయం ఉప్పొంగుతోంది. పదాలు సరిపోవు. జై ‘జై’ జై లవకుశ..’ అని రాజమౌళి ట్వీట్ చేశారు.

 

 

సాధారణంగా రాజమౌళి ఏ ఇంటర్వ్యూకి వచ్చినా... నేటి తరం హీరోల్లో మీ అభిమాన నటుడు ఎవరు అనడిగితే తడుముకోకుండా వెంటనే తారక్ అని చెబుతారు. ఎన్టీఆర్ నటనకు, డైలాగ్ డెలివరీకి జక్కన్న వీరాభిమాని. ఈ విషయాన్ని చాలాసార్లు ఆయనే చెప్పారు. ఇప్పుడు మరోసారి తన అభిమానాన్ని ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. అయితే రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్.కార్తికేయ కూడా ఎన్టీఆర్‌కి వీరాభిమాని. ‘జై లవ కుశ’ సినిమాను చూసిన కార్తికేయ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘ఎన్టీఆర్ అభిమానిగా నేను గర్వపడుతున్నాను. నువ్వు మమ్మల్ని క్లౌడ్9999లోకి తీసుకెళ్లిపోయావన్నా’ అని కార్తికేయ ట్వీట్ చేశాడు.

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Gunde Ninda Gudi Gantalu Today: ‘ఇతను ఎవరో నాకు తెలీదు’ మౌనిక మాటకు పగిలిన బాలు గుండె, మరో షాకిచ్చిన శ్రుతి